ఐపీఎల్ లో లక్నో వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన గొడవ.. విరాట్ కోహ్లీ తలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. లక్నో ప్లేయర్లు నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రాలతో పాటు మెంటర్ గౌతమ్ గంభీర్ తో కూడా వాగ్వాదానికి దిగాడు. తన కెరీర్ ఆరంభం నుంచే విరాట్ కోహ్లీలో దూకుడు కనిపిస్తోంది. దాదాపు ప్రతీ మ్యాచ్ లో క్యాచ్ పట్టినా.. వికెట్ పడినా చాలా అగ్రెసివ్ గా కోహ్లీ సెలబ్రేట్ చేసుకుంటాడు. ఈ సెలబ్రేషన్స్ కారణంగా కొన్ని మ్యాచ్ ల్లో జరిమానా కూడా చెల్లించుకున్నాడు. అయితే నవీన్ ఉల్ హక్ ని స్లెడ్జ్ చేయడంతో పాటు అతన్ని నువ్వు నా బూటికి అంటిన మట్టితో సమానం అని మీనింగ్ వచ్చేలా విరాట్ కోహ్లీ చేసిన సైగలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో నవీన్ ఉల్ హక్ పర్సనాల్ గా తీసుకోవడమే కాకుండా నన్ను అంటే నా వల్లను అన్నట్టే అంటు వ్యాఖ్యానించాడు.
Also Read : Online News: ఆన్‌లైన్ వార్తలకే జై కొడుతున్న ఇంటర్నెట్ యూజర్స్.. నివేదికలో వెల్లడి..
దీంతో అప్పటి వరకు విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేసిన వాళ్లందరు అతను చేసింది తప్పుపట్టడం స్టార్ట్ చేశారు. భారత్ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్ లు కోహ్లీ చేసింది తప్పేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే విషయాన్ని బీసీసీఐ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్,చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కి హాజరైన బీసీసీఐ వైఎస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా-నవీన్ ఉల్ హక్ ని కలిసి అసలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీశాడు. దీంతో పాటు లక్నో టీమ్ సభ్యులతో పాటు మెంటర్ గౌతమ్ గంభీర్ తో కూడా చాలా సేపు చర్చించాడు. అసలు ఏం జరిగింది..? విరాట్ కోహ్లీ ఏం మాట్లాడాడు.. ? నిజంగానే జాత్యాంహంకార వ్యాఖ్యలు చేశాడా..? అనే కోణంలో బీసీసీఐ దర్యాప్తు చేస్తుంది.
Also Read : CharDham Yatra : విరిగిపడిన కొండచరియలు.. పరుగు తీసిన యాత్రికులు
ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమింయాకి విరాట్ కోహ్లీ కీలకమైన బ్యాటర్. అతను ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ కీలకమైన ఆటగాడిగా ఉండబోతున్నాడు. ఇప్పటికే బీఐసీసీ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కక్షకట్టి, విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించాడని మాజీ చీఫ్ సెలక్షర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టడం సంచలనం రేపింది. ఇప్పుడు మరోసారి బీసీసీఐ-కోహ్లీపై యాక్షన్ తీసుకునేందుకు సిద్దమువుతుందా..? అనేది చాలామందిని వెంటాడుతున్న అనుమానం.. అదే జరిగితే విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.