Reaon Revealed Behind Kohli Gambhi Spat: లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన అనంతరం.. పెద్ద గొడవ జరిగిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. తొలుత నవీన్ ఉల్ హక్‌తో వాగ్వాదానికి దిగడం, ఆ తర్వాత గంభీర్ జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ మరింత పెద్దది కావడంతో.. ఆ వ్యవహారం ఇప్పటికీ చర్చలకు దారితీస్తోంది. ఈ గొడవ కారణంగా.. కోహ్లీ, గంభీర్ ఫీజుల్లో 100% ఫైన్ వేయడం జరిగింది. అసలు ఆ రోజు గొడవలో వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? అనే దానిపై ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే.. ఒక ప్రత్యక్ష సాక్షి ఆరోజు వారి మధ్య గొడవలో జరిగిన సంభాషణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు ఓ బాలీవుడ్ వెబ్‌సైట్ వెల్లడించింది. కోహ్లీ తిట్టిన ఓ బూతు వల్లే ఈ రచ్చ జరిగిందని ఆ వెబ్‌సైట్ కథనం. తొలుత నవీన్ ఉల్ హక్‌తో గొడవ పడ్డ కోహ్లీ.. ఆ తర్వాత ఈ విషయంపై కైల్ మేయర్స్‌తో చర్చించాడు. అప్పుడు సడెన్‌గా గంభీర్ జోక్యం చేసుకొని, కైల్ మేయర్స్‌ని తీసుకెళ్లాడు. సరిగ్గా ఆ సమయంలోనే కోహ్లీ.. ‘బ్లడీ Fu**.. నేను అతనికి సెండాఫ్ ఇస్తుంటే, మధ్యలో నువ్వేంటి’’ అని విరాట్ కోపంలో అన్నాడట. అది తన చెవిన పడటంతో.. గంభీర్ కోపాద్రిక్తుడై వాగ్వాదానికి దిగినట్టు ఆ వెబ్‌సైట్ పేర్కొంది.
MI vs CSK: ముగిసిన ముంబై బ్యాటింగ్.. చెన్నై ముందు స్వల్ప లక్ష్యం
ఇదిలావుండగా.. తన ఫీజులో 100% కోత వేయడంపై కోహ్లీ బీసీసీఐకి ఒక మెసేజ్ పంపినట్లు తెలిపింది. తాను నవీన్ ఉల్ హక్‌ని గానీ, గంభీర్‌ని గానీ ఏమీ అనలేదని.. అయినా 100% కోత వేయడం కరెక్ట్ కాదని.. ఆ మెసేజ్‌లో అతడు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే.. నవీన్‌పైకి బంతి విసరాలని తాను సిరాజ్‌కు చెప్పలేదని.. కేవలం బౌన్సర్స్ మాత్రమే వేయాలని సూచించినట్లు కోహ్లీ స్పష్టత కూడా ఇచ్చాడని సమాచారం. ఏదేమైనా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోహ్లీకి 100% ఫైన్ పడింది. కాగా.. ఈ గొడవపై కోహ్లీ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతూనే ఉన్నారు. యువ ఆటగాడైన నవీన్‌కు కోహ్లీతో పడేంత సీన్ ఉందా? అసలు సీనియర్స్‌కి ఎలా మర్యాద ఇవ్వాలని అతనికి నేర్పించాలి? అంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే.. గంభీర్‌పై కూడా నిప్పులు చెరిగారు. చిన్న గొడవని పెద్దది చేసింది గంభీరేనని, ఇందులో కోహ్లి తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.
Asaduddin Owaisi: మణిపూర్ మండిపోతుంటే, జవాన్లు చనిపోతుంటే.. కర్ణాటకలో ప్రచారమా?.. మోదీపై ఒవైసీ ఫైర్