ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య వివాదం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. గత మ్యాచ్‌లో గంభీర్ చర్యకు కోహ్లీ బదులిచ్చాడని విరాట్ అభిమానులు అంటుండగా.. సీనియర్స్ కు గౌరవం ఇవ్వడం లేదని గౌతీ ఫ్యాన్స్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ఈ క్రమంలో ఈ గొడవలో తప్పు ఎవరిది అన్న విషయం గురించి నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Also Read : Alwal News: అల్వాల్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగిని హల్ చల్.. కొత్తకారుతో భీభత్సం
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్‌స్టా పోస్ట్‌తో మరోసారి గంభీర్‌కు విరాట్ కోహ్లి పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. బుధవారం మరో ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పాత ఇంటర్వ్యూకు సంబంధించిన విజువల్స్ ను పంచుకున్నాడు. ఇందుకు.. ‘‘ది రియల్ బాస్’’ అంటూ కోహ్లీ క్యాప్షన్ ఇవ్వడంతో మరోసారి గంభీర్ అభిమానులకు చురకలంటించాడు.
Also Read : Jonty Rhodes : వారెవ్వా జాంటీ రోడ్స్.. నీకు సలాం
ఈ వీడియోలో క్రికెట్ డిస్ట్రిక్ట్‌తో రిచర్డ్స్ ముచ్చటిస్తూ.. పొట్టి ఫార్మాట్‌లో వివిధ లీగ్‌లలో ఆడటాన్ని తాను ఇష్టపడతానని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ ఆడీ ఆడీ బోర్ కొట్టిందని.. ఇప్పుడు ఐపీఎల్ లేదంటే సీపీఎల్ వంటి లీగ్‌లలో ఆడాలని ఉందని అని చెప్పిన వ్యాఖ్యలు ఉన్నాయి. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం (మే 1) నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ- లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది.
Also Read : Cyber Crime: మహిళలే టార్గెట్.. రోజుకు రూ.5 కోట్ల పైనే దోచేశాడు..!
అంతకు ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై తమ విజయానంతరం గంభీర్..ఆర్సీబీ ఫ్యాన్స్‌ను నోరు మూసుకోవాలి అన్నట్లు సైగ చేశాడు. అయితే, ఈ విషయాన్ని తేలికగా వదిలిపెట్టని విరాట్.. లక్నోలో తమ విజయం సాధించడంతో గంభీర్, లక్నో జట్టును కవ్వించేలా కోహ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇక ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫ్రీ హిట్ నేపథ్యంలో లక్నో టెయిలెండర్ నవీన్-ఉల్-హక్‌తో అతడికి తలెత్తిన గొడవలో కోహ్లీ జోక్యంతో వివాదానికి దారితీసింది. దీంతో కోహ్లీని ఆపడానికి అమిత్ మిశ్రా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
Also Read : India at UN: ఆ 5 దేశాలు అన్ని దేశాల కన్నా ఎక్కువా..? యూఎన్ఎస్‌సీ నిర్మాణంపై భారత్
మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ చేసుకునే సమయంలో నవీన్- కోహ్లీతో ప్రవర్తించిన విధానం.. గంభీర్ సహా మేయర్స్ జోక్యం చేసుకోవడంతో వివాదం కాస్త పెద్దదైంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం నవీన్‌కు సర్దిచెప్తూ సున్నితంగానే కోహ్లీని వారించే ప్రయత్నం చేశాడు. ఈ గొడవ నేపథ్యంలో కోహ్లీ-గంభీర్ మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెంటిల్మన్ గేమ్‌కు మాయని మచ్చ తెచ్చారంటూ టీమిండియా మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.