వికారాబాద్ జిల్లా దామగండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటు వల్ల అడవులు, గాలి, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు.
ఇవాళ అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉండడంతో నిన్న (ఆదివారం) ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి నమూనా రామ మందిరాన్ని సూక్ష్మ కళాకారుడు సున్నపు అశోక్ తయారు చేశాడు.. రోజుకు గంట చొప్పునా 20 రోజుల పాటు శ్రమించి మినీ రామ మందిరాన్ని నమూనాను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.
Vikarabad Crime: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. అటవీ ప్రాంతంలో మహిళ మెడకు చీర కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు హంతకుడు.
పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించారు. 108 వాహనంలో డీజిల్ లేదని, తాము ఏం చేయలేమని చెప్పారు. ఇక చేసేది లేక బాధితురాలిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… మోమిన్‌పేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన సాలెమ్మ (33)…
Vikarabad: బస్సు నిండా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో అతివేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి ప్రయాణికులు గాయపడిన ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.
ఈసారి తెలంగాణ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. గెలుపు అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విస్తృత ప్రచారాలు చేస్తున్నాయి. ఇందుకోసం రెండు పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి మద్దతుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేపట్టారు. శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన వికారాబాద్ జిల్లా పరిగి చేరుకున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ సపోర్టు చేస్తూ రోడ్ షో నిర్వహించారు. Also Read: Indian…
KTR Road Show: తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అధికార బీఆర్ఎస్ ఇప్పుడు తదుపరి ప్రచార దశపై దృష్టి సారించింది. ఈసారి గ్రేటర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగనున్నారు.
మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో రోడ్ షో వివరాలు ఇవే.. ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సపోర్టుగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్ టౌన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోసం కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో చేయనున్నారు.
వికారాబాద్ జిల్లా పూడుర్ మండలంలో కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల, గొరిల్లా గుట్ట, రహీం కోళ్లఫారం పరిసర ప్రాంతాలలో చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.