ఈ ప్రాజెక్ట్ మన దేశానికి అత్యంత ఉపయోగకరమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నేడు అబ్దుల్ కలాం జయంతి ఈ రోజు శంకుస్థాపన పనులు ప్రారంభించడం హర్షణీయమని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్ట్లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ మంత్రి మాట్లాడారు.
Navy Radar Station: ఎట్టకేలకు నేవీ రాడార్ స్టేషన్కు శంకుస్థాపనకు సిద్దమైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్ఎఫ్ నేవీ రాడార్ సెంటర్కు ఇవాళ మధ్యాహ్నం 12.55 గంటలకు శంకుస్థాపన జరగనుంది.
Occult Worship: ఓవైపు టెక్నాలజీ వైపు ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒక చోట క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉన్నాయి..
Vikarabad: వికారాబాద్ లో దోమ మండల ప్రజలు రోడ్డెక్కారు. రోడ్డు అంతా గుంతలమయంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. వర్షాకాల సమయంలో ఉన్న ఇబ్బందులు చాలవు అన్నట్లు వాటికి తోడుగా రోడ్లపై గుంటలతో ప్రజలు, వాహనదారులు, ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపూర్ గ్రామ మధ్యలో ఉన్న BT రోడ్ గత 10 సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి ప్రజలందరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రామపంచాయతీ నిధులతో కొంత మరమ్మతులు చేసినప్పటికీ మళ్ళీ తిరిగి గుంతలు ఏర్పడుతున్నాయి.…
Speaker Gaddam Prasad Kumar: గత ప్రభుత్వం జిల్లా పరిషత్ భవనం కోసం ఆర్డర్ కాగితం మాత్రమే ఇచ్చిందని నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
Kale vs Patnam Clashes: వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే యాదయ్య మధ్య అగ్ని వేస్తే భగ్గుమంటుంది.
బార్డరుకు వెళ్లి దేశానికి సేవ చేద్దామని సిద్ధమైన జవాన్ ఉరిస్తంభానికి వేళాడుతూ.. కనిపించాడు. దీంతో ఆ ఊరిలో విషాదం నెలకొంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి లో విషాదం నెలకొంది.
తాండూరులో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై గిరిజన బాలికల వసతి గృహ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో తన కూతురు తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బందికరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థిని తండ్రి రాములు నాయక్ ఆరోపించారు.