భర్త అంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు వాళ్లు భౌతికంగా దూరం అయిన తమతో ఉన్నారనే భావనలో ఉంటారు.. వికారాబాద్ తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ఉన్న ప్రేమను మొక్క పై చూపిస్తుంది.. మొక్కలో తన భర్తను చూసుకుంది.. ఇంట్లో ఏ శుభకార్యం అయిన కూడా ఆ చెట్టును రెడీ చేసి అపూరూపంగా చూసుకుంటుంది.. తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్బంగా చెట్టుకు వేడుక చేసింది. కుటుంబ…
వికారాబాద్ లోని మూసీనదితో పాటు కాగ్నానది, కోట్ పల్లి ప్రాజెక్ట్, సర్పన్ పల్లి, నంది వాగు ప్రాజెక్టుల నీరు అలుగు పారి ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన ఐజీ షనవాజ్ ఖాసీం, జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి కోట్ పల్లి ప్రాజెక్ట్ ను సందర్శించారు. ధారూర్ సమీపంలోని నాగ సముందర్ వద్ద రాక పోకలు నిలిచిపోవడంతో అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో గుండెపోటుతో మృతి చెందిన అల్లుని మృతదేహాన్ని చూసి తట్టుకోలేక మామ కూడా అనంత లోకాలకు వెళ్లాడు. తాండూర్ లోని బృందావన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మోయిన్ అహ్మద్ హార్ట్ ఎటాక్ తో మరణించాడు. అతని మృతదేహాన్ని చూసి స్పృహ కోల్పోయి మున్నాభాయ్ ను.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ అధికారుల చెకింగ్ వాహనంలో చోరీ జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన టీఎస్ఆర్టీసీకి చెందిన చెకింగ్ అధికారులు వికారాబాద్ జిల్లాలోని తాండురులో నిన్న (శుక్రవారం) రాత్రి 9.30 గంటలకు డిపోలో చెకింగ్ చేసినట్లు పేర్కొన్నారు. చెకింగ్ అనంతరం రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేసేందుకు డిపో పక్కనే ఉన్న హోటల్ కు వెళ్లారు. అయితే, అధికారులు భోజనం చేసేందుకు వెళ్లడం చూసిన దుండగులు పార్కింగ్ చేసిన వాహనంలో నుంచి ఓ బ్యాగ్ ను…
వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలంలోని మల్కాపూర్కు చెందిన మనోహర్ అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన మొబైల్ వాట్సాప్లో 'ఐ మిస్ యూ ఫ్రెండ్స్' అని స్టేటస్ పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పదేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో తండ్రి తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో గొడవల కారణంగా అన్నతో మాటల్లేకపోవడంతో తనకి ఎవరూ లేరు అనే మనోవేదనకు గురైన ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వికారాబాద్ లో దారుణం వెలుగు చూసింది..ప్రాణ స్నేహితుడు అని నమ్మిన ఫ్రెండ్ ను అతి దారుణంగా హతమార్చాడు..ఫ్రెండ్ భార్య పై కన్నేసిన కామాంధుడు అడ్డుగా ఉన్న ఫ్రెండ్ ను అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఈ దారుణం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రానికి చెందిన శేఖర్, గోపాల్ స్నేహితులు. పక్కపక్క ఇళ్ళలోనే వుండే వీరిద్దరూ ఉపాధినిమిత్తం హైదరాబాద్ లో వుంటున్నారు. శేఖర్ భార్యా పిల్లలతో కలిసి…
Vikarabad Sireesha Case: వికారాబాద్ జిల్లా కాలాపూర్లో శిరీష హత్యకేసులో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మిస్టరీ ఎట్టకేలకు వీడింది. శిరీష అనే యువతిని ఆమె బావ అనిల్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీష హత్యకేసులో అనిల్కు సహకరించిన రాజు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీ రాత్రి శిరీష నీటి కుంటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 11న శిరీష నీటి కుంటలో శవమై కనిపించింది.…
పరిగి మండలం కాలాపూర్ లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. మృతురాలిని శిరీషగా గుర్తించారు. శిరీష రెండ్రోజులుగా కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు తెలిపారు. హత్య చేసిన అనంతరం దుండగులు మృతదేహాన్ని నీటి కుంటలో పడేశారు. అయితే శిరీష హత్యపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అంతేకాకుండా శిరీషను చంపి కళ్లను స్క్రూ డ్రైవర్…
హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసిన పలువురు నిందితులు అనంతగిరి అడవుల్లో ట్రైనింగ్ తీసుకున్నాట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో లీకు వీరులు ఎక్కువైపోయారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుండగా వికారాబాద్ లో తాజాగా 10వతరగతి ప్రశ్నాపత్నం లీకైందన్న వార్త కలకలం రేపింది. ఏపీలోని కడపలో కూడా ఇలాంటి లీక్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పేపర్ లీక్ అయింది.