Lagacharla Incident: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటనలో పరిగి పీఎస్‌లో సమీక్ష ముగిసింది. ఈ మీటింగ్ లో అదనపు డీజీ మహేష్ భగవత్, ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
DK Aruna : ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంతా రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా…
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉందని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ NTVతో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Vikarabad: వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ఎంత పెద్ద వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు గ్రామాస్తులు చుక్కలు చూపించారు. ఫార్మా కంపెనీని గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అభిప్రాయ సేకరణకు వచ్చిన రెవెన్యూ సిబ్బందితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.
వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనపై దోమ పోలీసు స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
తనిఖీలలో ఆరు క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు. రాఘవేంద్ర క్లినిక్, హనుమాన్ క్లినిక్, గ్లోబల్ క్లినిక్, గఫర్ క్లినిక్, పల్లవి క్లినిక్ ల సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యా అర్హత లేకుండా ఎంబిబిఎస్ ప్రాక్టీస్ చేస్తున్న ఆరుగురు డాక్టర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్.ఎం.ఎల్ యాక్ట్ 34, 54 కింద కేసు నమోదు చేసి సంవత్సరం ఇంప్రెయర్మెంట్, ఐదు లక్షల ఫైన్ విధించి…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ షాకింగ్ వీడియో బయటపడింది. ఇది బీర్ తాగేవారిని షాక్‌కు గురిచేసింది. ఓ వ్యక్తి స్థానిక మద్యం దుకాణం నుంచి బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు.
కేసీఆర్ తెలంగాణను అల్లకల్లోలం చేసి పోయిండు.. ఏడు లక్షల కోట్లు అప్పుచేసి పోయిండని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఇవాళ వికారాబాద్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నెలకు రూ.7 వేల కోట్లు మిత్తి కడుతున్నామని, కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండే అని ఆయన వ్యాఖ్యానించారు.