Crime news: రోజు రోజుకి మానవ సంబంధాలు మాయావుతున్నాయి. మమతానురాగాలు కరువవుతున్నాయి. లోకంలో మానవత్వం మచ్చుకైనా లేదు అనిపించేలా రక్తసంబంధీకులే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిన వాళ్లే అనే విషయాన్నీ మర్చిపోయి విచక్షణారహితంగా కుటుంబసభ్యులే కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా లోని బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఖాసీంపూర్ గ్రామానికి…
వికారాబాద్ జిల్లా తాండూర్ లోని రాజీవ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో వాటర్ క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడి జనార్ధన్ అనే (కూలి ) వృద్ధుడు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందాడు.
భూమి యాజమాని వెంకట్ రాములు గుట్టు చప్పుడు కాకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ చేయించాడంతో.. విషయం తెలుసుకొని తహసిల్దార్ కార్యాలయాన్ని 25 మంది యువకులు ముట్టడించారు.
అతిగా ఫోన్ చేస్తుందని తండ్రి కూతురు మందలించినందుకు మనస్థాపానికి లోనై పదవ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాల గ్రామంలో జరిగింది.
యావత్ దేశంలోనే మిషన్ భగీరథ ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ అంటూ ప్రశ్నించారు. ప్రతీ రోజు ఒక కోటికి పైగా కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాము అని తెలిపారు. ఏదో జన్మలో పుణ్యం చేశా.. అందుకే ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసే అదృష్టం దక్కింది అని మిషన్ స్మిత సభర్వాల్ పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లాలో ఈనెల 21న తాండూర్ మోర్ సూపర్ మార్కెట్లో షెటర్ లిఫ్ట్ చేసి దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. ఈ చోరీ కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో చేధించారు. ఈ దొంగతనంకు సంబంధించిన వివరాలను తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు.
నాపరాతిని తమకున్న ఆర్డర్ల కోసం వివిధ ప్రాంతాలకు లారీలలో, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కానీ వాటిని తరలింపు ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నాపరాతి బండలను లారీలలో, ట్రాక్టర్లలో బాడీ లెవెల్ వరకు నింపకుండా.. అధిక లోడ్డుతో వెహికిల్స్ లో నింపుకొని రోడ్లపైకి రావడం వల్ల.. వెనక వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో కేవలం 50 రూపాయల కోసం హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా న్యాయస్థానం వెల్లడించింది. గత ఏడాది పెద్దేముల్ మండలం పాషాపూర్ తండాలో రూ.50 ఇవ్వలేదని మంగ్లీ భాయ్ని రాథోడ్ విల్లాస్ అనే వ్యక్తి హత్య చేశాడు.