Bengal Elections: మమతా సర్కారుకు షాక్.. సీఎస్, డీజీపీల ట్రాన్స్‌ఫర్..
- మమతా సర్కార్‌కు ఈసీ షాక్..
- డీజీపీ, సీఈఎస్‌ల బదిలీ..
- ఉన్నత పదవులకు కొత్త అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Elections: కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కార్‌కు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్ పోలీస్, బ్యూరోక్రసీలో కీలక అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. ప్రస్తుతం డీజీపీ, ప్రధాన కార్యదర్శులను తొలగించి, ఆ పదవుల్లో కొత్త అధికారులను నియమించింది. సీనియర్ IAS అధికారి దుష్యంత్ నారియాలా, నందిని చక్రవర్తి స్థానంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులవుతారు. పీయూష్ పాండే స్థానంలో ఉన్నత పోలీసు అధికారి సిద్ధ్ నాథ్ గుప్తా డీజీపీగా నియమితులయ్యారు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌తో సహా మరో ముగ్గురు సీనియర్ అధికారులను కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒక రోజు తర్వాత, ఎన్నికల సంఘం బెంగాల్‌లో కీలక అధికారులను బదిలీ చేసింది. 1992 బ్యాచ్ IPS అధికారి సిద్ధ్ నాథ్ గుప్తాను పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ జనరల్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DG & IGP)గా నియమించారు. గుప్తా 30 ఏళ్ల కెరీర్‌లో కీలక స్థానాల్లో విధులు నిర్వహించారు. నందిగ్రామ్ అల్లర్లు, లాల్‌గఢ్ నక్సల్స్ ఉద్యమం, డార్జిలింగ్ గోర్ఖాలాండ్ ఆందోళలన సమయంలో ఆయన శాంతిభద్రతల్ని సమర్థవంతంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన అల్లర్లను అదుపు చేయడంతో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
మరోవైపు, సీనియర్ అధికారి అజయ్ కుమార్ నంద్, సుప్రతీమ్ సర్కార్ స్థానంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అజయ్ ముకుంద్ రనడే అదనపు డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు) గా నియమితులయ్యారు. బదిలీ అయిన అధికారుల్ని పూర్తిగా ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి ఎన్నికల విధుల్లో నియమించొద్దని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని, సంబంధిత అధికారులు మధ్యాహ్నం 3 గంటల లోపు బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలీస్ అధికారులతో పాటు సీఎస్ నందిని చక్రవర్తి స్థానంలో దుష్యంత్ నరియాలా కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చక్రవర్తిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధుల్లో ఉంచొద్దని ఆదేశించింది. సంఘమిత్ర ఘోష్‌ను హోం అండ్ హిల్ అఫైర్స్ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన తర్వాతే, ఈ ఇద్దరు అధికారులను బాధ్యతల నుండి తప్పించే నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!