Vikarabad: వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో అర్థరాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటన కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, అర్థరాత్రి ముసుగు వేసుకుని వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా అర్జున్‌పై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో అర్జున్‌కు పొత్తికడుపు భాగంలో మూడు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి.…
చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం ఓ కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన దంపతులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ఓ సెలూన్ షాప్ యజమాని విన్నుతన నిరసన చేపట్టాడు. రోడ్డు పనుల వల్ల తనకు వ్యాపారం జరగడం లేదంటూ.. రోడ్డు మధ్యన నీటిలో కుర్చీ వేసుకొని కూర్చుని నిరసన తెలిపాడు. రోడ్డు మధ్యలో కూర్చోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు మధ్య నుంచి లేవాలని స్థానికులు, అధికారులు ఆడినా అతడు ససేమిరా అన్నాడు. రోడ్డు పనుల వల్ల తనకు తీవ్ర నష్టం జరుగుతోందని, తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన…
ACB Raid: వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏఓ) భూపతి జయశంకర్, ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కోసం జయశంకర్ లంచం డిమాండ్ చేశారు. మొదటగా రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా, చివరికి రూ. 75 వేలకు అంగీకరించారు. లైసెన్స్ అనుమతులు ఇచ్చిన తర్వాత, మొదటి విడతగా రూ. 50…
వీడు మనిషి కాదు.. మానవమృగం.. కన్నతల్లి నే కిరాతకంగా హతమార్చాడు.. బండరాయితో మోది తల్లిని చంపి పరారయ్యాడు. చంపింది కొడుకే అని తెలిసి.. గ్రామస్తులంతా షాక్ అయ్యారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఎందుకు చంపాడు..? హత్య చేసి.. ఆపై ఎలాంటి యాక్షన్ ప్లాన్ వేద్దామనుకున్నాడు..? ఇది వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామం. గ్రామానికి చెందిన 62 ఏళ్ల మల్లమ్మ రక్తపుమడుగులో పడి ఉంది. గమనించిన స్థానికులు వెళ్లి చూడగా… అప్పటికే మల్లమ్మ చనిపోయింది.…
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ హైదరాబాద్ లింగంపల్లి లోని ఇంట్లో రెండు నెలలుగా ఇంటి పని చేస్తుంది. పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేంతాలలో రెండు ఎకరాల భూమి ఉంది.
Heart Break Incident : వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం పర్వత్‌పల్లి గ్రామంలో ఉన్న అంజనేయ స్వామి దేవాలయం వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ కొండముచ్చు చింత చెట్టు మీద నుంచి కాలు జారి కిందపడి మృతి చెందింది. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. మృతి చెందిన కొండముచ్చుకు హిందూ సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు ఈ ఘటనపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కొండముచ్చుకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు…
Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం తెలుసుకుని భర్త తరిమేశాడు...!! భర్తకు దూరమైన విషయం తెలిసి ప్రియుడు మరోసారి దగ్గరయ్యాడు !! భర్త వదిలేస్తేనేం నీకు నేనున్నాంటూ చేరదీశాడు. కానీ.. ఈసారి ఆ ప్రియుడు నమ్మించి వంచించాడు. శారీరకంగా వాడుకుని వదిలేశాడు. అటు భర్తకు దూరమై.. ఇటు ప్రియుడూ వదిలేసి.. ఏకాకిలా మారింది ఆ యువతి. చేసేది లేక న్యాయం కోసం తాండూరు పోలీసులను ఆశ్రయించింది యువతి.
Crime News: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెడ్డిపల్లి వెంకటేష్ (34) అనే యువకుడిని అతని భార్య జయశ్రీ, మామ పండరి కలిసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. పోలీసుల అందించిన వివరాల ప్రకారం… వెంకటేష్ తన భార్య జయశ్రీపై అనుమానంతో తరచూ గొడవపడుతూ.. శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సమాచారం. ఇదే కారణంగా భార్య మానసికంగా విసిగిపోయి తన తండ్రి పండరి సహాయంతో ఈ హత్య ప్లాన్ వేసినట్లు…