Ram Mandir: నేడు జరిగే అయోధ్య రామ మందిరలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే అయోధ్య నగరం సర్వంగా సుందరంగా సిద్ధమైంది. అయితే, బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో దేశమంతా రామనామ స్మరణతో మారుమోగిపోతుంది. ఇక, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు సున్నపు అశోక్ ఐస్ క్రీమ్ పుల్లలతో రామమందిర నమూనాన్ని నిర్మించాడు.
Read Also: Ayodhya: నీలకంఠ పక్షిని చూసేందుకు వెళ్తున్న రామభక్తులు.. ఎందుకో తెలుసా..?
అయితే, సున్నపు అశోక్ కు చిన్నప్పటి నుంచి చిత్రకళ నైపుణ్యంలో ఇంట్రెస్ ఎక్కువ.. దీంతో పనికి రానీ వస్తువులతో ఆకట్టుకునేలా కళాకృతులను తయారు చేసి అందరి దృష్టిని ఆక్షిరిస్తున్నాడు. తాజాగా తన కలను విభిన్నంగా రూపొందించాడు. ఇవాళ అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉండడంతో నిన్న (ఆదివారం) ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి నమూనా రామ మందిరాన్ని తయారు సున్నపు అశోక్ చేశాడు. రోజుకు గంట చొప్పునా 20 రోజుల పాటు శ్రమించి మినీ రామ మందిరాన్ని నమూనాను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.