వికారాబాద్ జిల్లా దామగండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటు వల్ల అడవులు, గాలి, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. చివరిగా సంతకం పెట్టాల్సి ఉండగా మాకు బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వాలని కేసీఆర్ ఆ ఫైల్ ను ఆపారు.. ఇది కేంద్రానికి సంబంధించినది.. దాని భద్రతకు సంబంధించిన అంశం.. ఇప్పుడు అక్కడ చాలా చెట్లు నరికేశారు.. గడ్డి ఉన్న చోటే నిర్మాణాలు జరుగుతున్నాయి.. తమిళనాడులో 30 సంవత్సరాల నుంచి అక్కడ నేవీ రాడార్ ను కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు అని ఆమె తెలిపారు. పరిగి కేంద్రీయ విద్యాలయాలు, నేవీ స్కూల్స్ వస్తాయి.. తెలంగాణ ప్రైడ్, ఈ ఫైల్ మా చేతుల నుంచి వెళ్ళింది కాదు.. అన్నీ బీఆర్ఎస్ పార్టీ నుంచే చేశారు అని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Read Also: Kerala Court: కేరళ కోర్టు సంచలన తీర్పు.. బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష!
బీఆర్ఎస్ నేతలు చాలా మోసం చేశారు అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పర్సెంటెజ్ కోసం ఇతరులకు భూములు లీజుకు ఇచ్చారు..44 జీవో ఇచ్చి 2010 సెప్టెంబర్ లో తూర్పు నావికా దళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది.. ఉద్యమం వల్ల ఏమి జరగలేదు.. వాళ్ళు చేస్తోంది టైమ్ పాస్ కోసమే.. ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో రాజకీయాలు చేయొద్దు అని ఆమె కోరారు. తెలంగాణకు మంచి పేరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ముప్పు ఉండదు.. ఈ నేవీ ప్రాజెక్టు వల్ల చీమకు కూడా హానీ కలుగదు అని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
Read Also: Kalki: పాన్ వరల్డ్ సినిమా నుంచి టీజర్… త్వరలో
బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్లో అహంకారం కనిపిస్తుంది అని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు.. కవిత పూలే విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.. బీసీలపై అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ను తొలగించి బీసీకి ఆ పదవి ఇవ్వాలన్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను.. ఉందుకంటే, నేను వైఎస్సార్సీపీలో లేను కాబట్టి కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేస్తాను.. ఏపీ ఎన్నికల షెడ్యూల్ రాగానే తప్పకుండా ప్రచారంకు వెళ్తాను అని ఆమె పేర్కొన్నారు.