వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి లో విషాదం నెలకొంది. కుంట చింటూ (20) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుండాల్ గ్రామానికి చెందిన యువతికి తను ప్రేమిస్తున్నాట్లు జవాన్ తెలిపాడు. చింటూ తనను ప్రేమిస్తున్నట్లు ఈ విషయాన్ని ఆ యువతి తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన కుటుంబీకులు యువకుడిని కొట్టేందుకు ప్రయత్నించారు. బెదిరించి వెళ్ళిపోయారు. గ్రామంలో తన తండ్రి పరువు పోయిందని మనస్థాపానికి గురై గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్మీ జవాన్ చింటూ. 2023 లో ఇండియన్ ఆర్మీలో సెలక్టై బెంగళూరులో శిక్షణ పూర్తి చేశాడు చింటు. గుజరాత్ లో ఉద్యోగంలో జాయిన్ కావలసి ఉండగా.. సెలవుపై గ్రామనికి వచ్చాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
READ MORE: Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం..యువతి ప్రేమను నిరాకరించడంతో ఆర్మీ జవాన్ ఆత్మహత్య