యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్లో నటిస్తున్నాడు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మూవీలో ఎన్టీయార్ నటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… దీని కంటే ముందే కమిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ ఎన్టీయార్ సినిమా ఉంటుందనే దాని నిర్మాతలు చెబుతున్నారు. ఇంతలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనతో – కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా…
కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాలు పంచుకున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ హీరోలంతా తమవంతుగా భారీ విరాళాలను తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. తాజాగా ఈ జాబితాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేరిపోయారు. విజయ్ సేతుపతి ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు…
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎంతవరకు అయిన సిద్ధమవుతున్నారు దక్షిణాది తారలు. ఒకప్పుడు ఇది బాలీవుడ్ వరకే పరిమితం కాగా, ఇటీవలే సౌత్ సినిమాలోనూ ఎక్కువగా ఈ పోకడ కనిపిస్తోంది. ఇక వెబ్ సిరీస్ లోనైతే నో కండిషన్స్ అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కాగా కోలీవుడ్ నటి అండ్రియా కథా ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటించేందుకు అధిక ప్రాధాన్యత చూపిస్తోంది. ప్రస్తుతం ఆమె మిష్కిన్ దర్శకత్వంలో ‘పిశాసు-2’ సినిమాలో నటిస్తోంది. పూర్ణ, రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలను పోషిస్తుండగా,…
మొత్తం దేశంలోనే కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా కొనసాగుతోంది. చెన్నై సహా రాష్ట్రమంతటా స్ట్రిక్ట్ లాక్ డౌన్ విధించారు. మరి ఇటువంటి సమయంలో సినిమా కష్టాలకు కొదవుంటుందా? కోలీవుడ్ లో చాలా సినిమా థియేటర్లు లేక రిలీజ్ అవ్వటం లేదు. అంతకంటే ఎక్కువ సినిమాలు ప్రొడక్షన్ దశలో, పోస్ట్ ప్రొడక్షన్ దశలో నిలిచిపోయాయి. అందుకే, అన్ని విధాల తమ సినిమాలు పూర్తైన దర్శకనిర్మాతలు ఓటీటీ వేదికలకు జై కొడుతున్నారు. ఈ లిస్ట్…
తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. కమల్ హాసన్ పార్టీ ఒక్కచోట కూడా గెలుపొందలేక పోయింది. కమల్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. లోకేశ్ కనకరాజ్ తో చేస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా ‘విక్రమ్’ ను పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్, 19(1)a, కడైసీ వ్యవసాయి, మామణిదన్, ముంబైకార్’ వంటి సినిమాలతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కమల్ తో నటించటం కన్ ఫామ్ అట.…
తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విభిన్నమైన పాత్రలలో నటిస్తూ విలక్షణ నటుడుగా మెప్పిస్తున్నారు. ఇప్పుడు సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న సినిమాలో, సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి ప్రచారంలో వున్న ‘మెర్రీ క్రిస్మస్’ టైటిల్ నే ఖరారు చేశారు.ఈ విషయాన్ని నిర్మాత రమేశ్…
విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. గతేడాది నవంబర్ 15న ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు.…
విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. ఈ మాస్ ఎంటర్టైనర్ గతేడాది నవంబర్ 15న తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘విజయ్ సేతుపతి’ చిత్రం తాజాగా…
ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ఫస్ట్ కొలాబరేషన్ మూవీ షూటింగ్ ఏప్రిల్ 15న మొదలు కావాల్సింది. కానీ కత్రినా కు కొవిడ్ 19 పాజిటివ్ రావడంతో అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రమేశ్ తురానీ దీనిని నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా ఇవాళ దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ఏ ప్రాజెక్ట్స్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కత్రినాతో సినిమా తిరిగి ఎప్పుడు మొదలవుతుందో…
దక్షిణాదిన బిజీగా ఉన్న స్టార్ ఎవరంటే తప్పకుండా విజయ్ సేతుపతి పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ సినిమా ‘ముంబైకార్’ షూటింగ్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ఎన్నో స్క్రిప్ట్ లు విని ఉన్నాడు. వాటిలో కొన్నింటికి డేట్స్ కేటాయించవలసి ఉంది. ‘సైరా, ఉప్పెన’ వంటి చిత్రాలతో తెలుగు వారికి కూడా సన్నిహితుడయ్యాడు విజయ్ సేతుపతి. తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటున్న విజయ్ అందుకు అనుగుణంగా తెలుగు కూడా నేర్చుకుంటున్నాడట. విజయ్ సేతుపతి…