స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎంతవరకు అయిన సిద్ధమవుతున్నారు దక్షిణాది తారలు. ఒకప్పుడు ఇది బాలీవుడ్ వరకే పరిమితం కాగా, ఇటీవలే సౌత్ సినిమాలోనూ ఎక్కువగా ఈ పోకడ కనిపిస్తోంది. ఇక వెబ్ సిరీస్ లోనైతే నో కండిషన్స్ అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కాగా కోలీవుడ్ నటి అండ్రియా కథా ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటించేందుకు అధిక ప్రాధాన్యత చూపిస్తోంది. ప్రస్తుతం ఆమె మిష్కిన్ దర్శకత్వంలో ‘పిశాసు-2’ సినిమాలో నటిస్తోంది. పూర్ణ, రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలను పోషిస్తుండగా, విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో ఆండ్రియా నగ్నంగా నటించినట్లు తెలుస్తోంది. కథ డిమాండ్ చేయడంతో ఒకానొక సందర్భంలో ఆమె నగ్నంగా నటించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ‘ఆడై’ చిత్రం కోసం అమలాపాల్ నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఆండ్రియా కూడా అమలాపాల్ సీన్ వలె కనిపించనుందని కోలీవుడ్ లో వినిపిస్తోంది. పరిమిత సంఖ్యలోనే ఈ సన్నివేశ షూటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది.