‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ వన్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ, హిందీ వర్షన్ కి వచ్చిన రెస్పాన్స్ తో పొలిస్తే తెలుగు, తమిళ భాషల్లోని వర్షన్స్ కి కాస్త తక్కువ రియాక్షన్ ఎదురైంది. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’తో సీన్ మారిపోయింది. అమేజాన్ ప్రైమ్ లోని సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ క్రేజీగా మారిపోయింది. సమంత లాంటి స్టార్ బ్యూటీ నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించటమే కాక అది కాస్తా కాంట్రవర్సియల్ అవ్వటంతో ‘ద ఫ్యామిలీ మ్యాన్’ ఇప్పుడు తమిళనాడులో పాప్యులర్ అయిపోయింది.
దక్షిణాదిలోనూ ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ తో తిరిగి వస్తాడని ఆల్రెడీ మేకర్స్ హింట్ ఇచ్చేశారు. సీజన్ 2 చివర్లో అందుకు సంబంధించిన సీన్ కూడా ఉంది. అయితే, మూడో సీజన్ లో కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి నటిస్తాడని చెన్నైలో జోరుగా టాక్ నడుస్తోంది. గతంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఓ క్యారెక్టర్ ని ఆఫర్ చేశారు సేతుపతికి. కానీ, ఆయన అప్పట్లో దాన్ని రిజెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు నెక్ట్స్ సీజన్ లో విజయ్ కూడా ‘ద ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ లో భాగం అవుతాడని కోలీవుడ్ లో బలంగా చెప్పుకుంటున్నారు. చూడాలి మరి, దీని పై సేతుపతిగానీ, ‘ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్ రాజ్, డీకే కానీ ఏ విధంగా స్పందిస్తారో…