తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విభిన్నమైన పాత్రలలో నటిస్తూ విలక్షణ నటుడుగా మెప్పిస్తున్నారు. ఇప్పుడు సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న సినిమాలో, సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి ప్రచారంలో వున్న ‘మెర్రీ క్రిస్మస్’ టైటిల్ నే ఖరారు చేశారు.ఈ విషయాన్ని నిర్మాత రమేశ్ తౌరుని చెప్పారు. ఏప్రిల్లోనే మొదలవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్.. కరోనా వేవ్ కారణంగా నిలిచిపోయింది. అయితే జూన్లో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నట్టు నిర్మాత రమేశ్ తెలిపారు.