హృతిక్ రోషన్, ఆపైన కియారా అద్వాణీ, అటు పైన విజయ్ దేవరకొండ, ఆ మీద సమంత రూత్ ప్రభు, అటు మీద దుల్కర్ సల్మాన్… ఏంటి ఈ లిస్టు అనుకుంటున్నారా? ఇదో ‘మింత్రా మల్టీ స్టారర్’! ప్రస్తుతం ఆన్ లైన్ యుగం నడుస్తోంది. కరోనా లాక్ డౌన్స్ పుణ్యం కొద్దీ రోడ్డు మీదకు వెళ్లే అవకాశాలు మరింత తగ్గిపోయాయి. షాపింగ్ ప్రియులు ఏం చేస్తారు మరి? అంతా అన్ లైన్ లోనే కానిచ్చేస్తున్నారు. అందుకే, ఈ కామర్స్…
రౌడీ బాయ్ గా యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. సోషల్ మీడియా లో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 1 కోటీ 25 లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగి సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డు సృష్టించిన విజయ్ ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కోటి మంది ఫాలోవర్స్…
ప్రముఖ యాంకర్, నటుడు టిఎన్ఆర్ ను సోమవారం (మే 10) కోవిడ్ -19 బలి తీసుకుందన్న విషయం మీడియా వర్గాలను, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. టిఎన్ఆర్ కు వారం క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హైదరాబాద్, మల్కాజ్ గిరి లోని ఆసుపత్రిలో చేరారు. టిఎన్ఆర్ ఆక్సిజన్ స్థాయి గణనీయంగా తగ్గడం వల్ల శ్వాస సమస్యతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. నాని, విజయ్…
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో షాలిని పాండే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అన్ని ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రంతో ‘అర్జున్ రెడ్డి’ పాత్రలో విజయ్ దేవరకొండ జీవించేశాడు. టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతేనా ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కూడా బాక్సాఫీస్…
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. పోసాని, వెన్నెల కిషోర్, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు సందీప్ కిషన్, నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్’ చిత్రం తెరకెక్కింది. వీరిద్దరూ కలిసి మరోసారి ‘గల్లీ రౌడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి కార్తీక్, చౌరస్తా రామ్ సంయుక్తంగా ఈ…