విజయ్ దేవరకొండ ఏం చేసినా ఒక సెన్సేషన్ అవ్వడం ఖాయం. అతని నోటి నుంచి ఏదైనా ఒక మాట జాలువారినా, సినిమాలకు సంబంధించి ఏదైనా పోస్టర్ వచ్చినా.. హాట్ టాపిక్ అయిపోతుంది. ఇప్పుడు అతను రిలీజ్ చేసిన ‘లైగర్’ న్యూస్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ సృష్టిస్తోంది. సెలెబ్రిటీలు సైతం స్పందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సమంత చేసిన బోల్డ్ కామెంట్ అయితే, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘‘విజయ్ దేవరకొండకి నియమ, నిబంధనలు తెలుసు. కాబట్టి, వాటిని బ్రేక్ చేయగలడు కూడా! ధైర్యం, కీర్తి అతని సొంతం. విజయ్.. లైగర్ పోస్టర్ అదుర్స్’’ అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది. ఇందుకు విజయ్ స్పందిస్తూ.. ‘సామ్ నువ్వు బెస్ట్’ అని తెలిపాడు. ‘మహానటి’ సినిమా నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం కుదిరింది. ఇక ఇప్పుడు ‘ఖుషీ’ సినిమాలో కలిసి నటిస్తున్న తరుణంలో.. వీరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే సమంత తన స్నేహితుడి న్యూడ్ ఫోటోపై ఇలా ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేయడం సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది.
కేవలం సమంత మాత్రమే కాదు.. అనుష్క, తమన్నా సైతం ఆ పోస్టర్‌పై స్పందిస్తూ, న్యూడ్‌గా కనిపించేందుకు విజయ్ చేసిన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. లైగర్ మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. కాగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేస్తున్నారు. అనన్యా పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.