గతంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో రశ్మిక పదే పదే విజయ్ ఇంటికి వెళ్ళడం, పండగలలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో గడపటం వంటివి అందుకు నిర్ధారణగా సోషల్ మీడియా కథనాలు వండి వార్చింది. దీనిని విజయ్ ఖండించటంతో కథనాలు ఆగిపోయాయి. అయితే తాజాగా మరోమారు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దానికి కాఫీ విత్ కరణ్ షో వేదికగా మారింది.
కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో సెకండ్ ఎపిసోడ్ లో జాన్వీ, సారా ఆలీఖాన్ సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లోనే వీరిరువురు విజయ్ దేవరకొండ, రశ్మిక ఎఫైర్ గురించి ప్రస్తావించారు. ఇటీవల కాలంలో రశ్మిక ఇన్ స్టా ఫాలోయర్స్ పెరుగుతున్నట్లు గమనించానని జాన్వీ చెబుతూ విజయ్ దేవరకొండతో ప్రేమ వ్యవహారమే అందుకు కారణమని సారా ఆలీఖాన్ చెప్పినట్లు తెలియచేసింది.
అంతే కాదు ఏకంగా తను సారా ఇద్దరు సోదరులతో డేటింగ్ చేసిన విషయాన్ని కూడా బట్టబయలు చేశారు వీరిద్దరూ. వారి పేర్లను కూడా వెల్లడిస్తూ శిఖర్ పహారియా, వీర్ పహారియాగా చెప్పారు. తన తల్లి శ్రీదేవి చనిపోయినపుడు సోదరుడు అర్జున్ కపూర్ ఎంతో సహాయం చేసినట్లు జాన్వీ పేర్కొంది. ఇక జాన్వీ కపూర్ నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’ ఈ నెలాఖరులో ఓటీటీలో విడుదల కాబోతోంది. నయనతార నటించిన తమిళ సినిమా ‘కొలమావు కోకిల’కు ఇది రీమేక్. పేరు పెట్టని సారా సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.