క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి కాంబోలో రాబోతున్న సినిమా ‘లైగర్’. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ‘లైగర్’ ఫస్ట్ సింగల్ గా ‘అక్డీ పక్డీ’ సాంగ్ ప్రోమోను ఈ నెల 8న, పూర్తి పాటను 11న రిలీజ్ చేయబోతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చిత్రంలోని ప్రధాన జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ హ్యాపీ మూడ్ లో కనిపిస్తున్నారు. అంతేకాదు. విజయ్… అనన్య చేత విజల్ కొట్టిస్తున్నాడు. విజయ్ దేవరకొండ రెడ్ బ్లేజర్ ధరించగా, అనన్య బ్లాక్ అండ్ అవుట్ ఫిట్ తో మెరిసిపోతోంది. ఈ పార్టీ సాంగ్ పెప్పీ నంబర్ గా ఉండబోతోందని పబ్ సెట్ చూస్తే అర్థమౌతోంది. లిజో జార్జ్-డిజె చేతాస్ ఈ పాటను స్వరపరచగా, హుక్‌లైన్ సునీల్ కశ్యప్ ఇచ్చాడు. అజీమ్ దయాని మ్యూజిక్ ని సూపర్ వైజ్ చేశారు. దేవ్ నేగి, పావ్నీ పాండే, లిజో జార్జ్ ఈ పాట హిందీ వెర్షన్‌ను పాడారు. ఈ పాటకు మొహ్సిన్ షేక్, అజీమ్ దయాని సాహిత్యం అందించారు.
తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాట తమిళ వెర్షన్ కు సాగర్ సాహిత్యం అందించగా వైష్ణవి కొవ్వూరి, సాగర్ కలసి పాడారు. విష్ణు వర్ధన్, శ్యామ మలయాళ వెర్షన్ ని ఆలపించగా, సిజు తురవూర్ సాహిత్యం అందించారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర రాసిన ఈ పాట కన్నడ వెర్షన్ ని సంతోష్ వెంకీ, సంగీత రవిచంద్రనాథ్ ఆలపించారు. సాగర్ సౌత్ మ్యూజిక్ అడ్మినిస్ట్రేటర్ గా వున్నారు. ఒకేసారి ఈ ఐదు వర్షన్స్ పాటనూ విడుదల చేసి, మూవీ మీద క్రేజ్ ను స్కై లెవల్ కు తీసుకెళ్ళాలన్నది పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఆలోచన.