నోయిడాలో ఓ మహిళ బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూల కుండీని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఓ దుకాణం బయట ఉంచిన పూల కుండీని దొంగిలిస్తున్న మహిళను కొందరు అడ్డుకోగా.. ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.
బీహార్‌లో మద్యంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో కల్తీ మద్యం దందా, అక్రమ మద్యం రవాణా పెరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 37 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు.
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఫోన్ చేస్తానని బెదిరిస్తూ నైట్ పెట్రోలింగ్ పోలీసులను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చెన్నైకి చెందిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
Virat Kohli and Anushka Sharma at Krishna Das Kirtan in Mumbai: ఆదివారం బెంగళూరు టెస్టు ముగిసిన అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ముంబై చేరుకున్నాడు. విరాట్ ఇక్కడకు చేరుకున్న వెంటనే.. అతను తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆదివారం దేశవ్యాప్తంగా ‘కర్వా చౌత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జంట కీర్తన కార్యక్రమానికి హాజరై భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నారు. కృష్ణదాస్…
సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీవీ ఉంటే.. మరి కొన్ని హర్రర్ ఇతరత్రా వీడియోలు దర్శనమిస్తాయి. అయితే ఎక్కువగా ఫన్నీ వీడియోలను చూడటానికే నెటిజన్లు ఇష్టపడతారు. కొన్ని నమ్మే రకంగా ఉంటే..మరి కొన్ని నమ్మశక్యం కానీ వీడియోలు ఉంటాయి. అయితే.. ఇటీవల, బీహార్ లో ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kid Assaults: పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఓ వ్యక్తి తన కుక్కను అనుకరిస్తున్నాడన్న ఆరోపణతో ఐదేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఇందులోని ఆందోళన కలిగించే దృశ్యాలు వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. 5 ఏళ్ల బాలుడు ట్యూషన్ క్లాస్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కుక్క మొరుగడాన్ని అనుకరిస్తూ కనిపించాడు. ఈ చర్య కుక్క యజమానికి కోపం తెప్పించింది. దాంతో ఆగ్రహించిన…
టెక్ హబ్‌గా పేరొందిన బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం. ఈ క్రమంలో.. జనాలు చాలా సేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. కాగా.. ఇటీవల తన స్నేహితురాలితో కలిసి ఆటోలో వెళ్తున్న ఓ యువతి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఆటోలో కూర్చున్న ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. దీంతో.. ఆటో దిగి వెళ్లి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ (BCCI) షేర్ చేసింది. అందులో.. గిల్‌కు రిషబ్ పంత్ బౌలింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా పంత్ బౌలింగ్ చేయడం కనిపించింది. కాగా.. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్సై కొట్టిందని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. ఈ నెల 22 న జగిత్యాలలోని శివప్రసాద్ అనే వ్యక్తం తన నివాసంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.