Puspa Kissik Song: దేశవ్యాప్తంగా పుష్ప మానియా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్లలో రిలీజ్ అయిన పుష్ప మొదటి షో నుండే భారీ హిట్ సొంతం చేసుకొని రికార్డులు సృష్టిస్తోంది. ఇండస్ట్రీ ఏదైనా సరే పుష్ప గాడు తగ్గేదెలా అన్నట్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. మూడు రోజులలో 600 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్ప// 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇకపోతే మొదటి పార్ట్ లో సమంత చేసిన పాట సూపర్ హిట్ కాగా, రెండో పార్ట్ లో శ్రీ లీల చేసిన దెబ్బలు పడతాయరో.. కిసక్ పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ 60 ఏళ్లు దాటిన భామలు ఈ పాటకు డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో ఉన్న శాంతాయి వృద్ధ ఆశ్రమంలో ఉన్న భామలు కిసక్ పాటకు సింపుల్ స్టెప్పులు వేస్తూ రీల్ చేశారు. ఈ వీడియోని ఆశ్రమం వారు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ రీల్ లో ముసలి భామలు వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అంతే కాదండి, ఈ భామలు చేసిన డాన్స్ ను పుష్ప టీం కూడా షేర్ చేయడంతో మరింత పాపులర్ అవుతోంది. సదరు వృద్ధాశ్రమంలో ఉండే తాతయ్యలు, భామలు ఎంత ఎనర్జీటిగా ఉంటూ పలు ట్రెండ్ అవుతున్న పాటలకు డాన్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.