బీహార్‌లో మద్యంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో కల్తీ మద్యం దందా, అక్రమ మద్యం రవాణా పెరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 37 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తీసుకు వచ్చిన మద్యం గా నిర్ధారణ అయింది. అయితే తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
READ MORE: North Korea: క్షిపణి స్థావరాలను సందర్శించిన అధ్యక్షుడు కిమ్
బీహార్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్‌లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పట్టుకోవడంతో డ్రైవర్ , మద్యం వ్యాపారి ట్యాంకర్‌ను జాతీయ రహదారిపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియో ప్రకారం.. హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్‌లో సుమారు 200 బీరు డబ్బాలను తరలించేందుకు ప్రయత్నించారు. అయితే దీనికు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందడంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.
READ MORE:North Korea: క్షిపణి స్థావరాలను సందర్శించిన అధ్యక్షుడు కిమ్
ఈ విషయాన్ని గమించిన స్మగ్లర్లు ట్యాంకర్‌ను జాతీయ రహదారి వైపు మళ్లించడాన్ని గమనించిన అధికారులు రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో డ్రైవర్, మద్యం వ్యాపారి అక్కడినుంచి పలాయనం చిత్తగించారు.నాగాలాండ్‌లో రిజిస్టర్ అయిన ట్యాంకర్‌ను ముజఫర్‌పూర్‌లో స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. అలాగే పట్టుబడిన మద్యం అరుణాచల్ ప్రదేశ్‌లో తయారైందని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా చేసిన స్థానిక వ్యాపారిని గుర్తించి, అతడిని అరెస్టు చేసేందుకు దాడులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
कल मुजफ्फरपुर में एक टैंकर के अंदर से निकला अवैध शराब का इतना बड़ा खेप
कब शराबबंदी को फेल मानेंगे नीतीश कुमार?#Muzaffarpur #MuzaffarpurAsks #Bihar #HoochTragedy pic.twitter.com/gRqjyOwaFD
— Thakur Divya Prakash (@Divyaprakas8) October 23, 2024