Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. జట్టులో తన స్థానాన్ని నిలుపుకోవడానికి వచ్చానని మూడు ఇన్నింగ్స్‌ల్లోనే తన ప్రదర్శనతో చూపించాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అతను 120కి పైగా పరుగులు చేశాడు. అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కూడా నితీష్ రెడ్డి అత్యధిక పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. తన ఇన్నింగ్స్ సమయంలో నితీష్ కుమార్ ఆడిన రివర్స్ స్కూప్ వీడియో నెట్టింట సూపర్ వైరల్ అవుతోంది. నిజానికి ఆ షాట్ కు వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యపోయారంటే నమ్మండి.
అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నితీశ్ రెడ్డి ఒక ఎండ్ నుంచి వరుసగా వికెట్లు పతనమైనప్పటికీ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. అతను 42 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు. ఇన్నింగ్స్ 42వ ఓవర్‌లో ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్‌కు నితీష్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్ రెండో బంతికే రివర్స్ స్కూప్ షాట్‌తో సిక్సర్ బాదాడు. నాన్-స్ట్రైక్‌లో నిలబడి ఉన్న జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ షాట్‌కి అతనిని నవ్వుతూ ప్రశంసించాడు. ఆ ఓవర్లో నితీష్ మొత్తం 21 పరుగులు చేశాడు.
టీ విరామం తర్వాత భారత్ కెప్టెన్ రోహిత్ శర్మను బోలాండ్ ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. రిషబ్ పంత్ (21)ను పాట్ కమిన్స్ అవుట్ చేశాడు. అనంతరం నితీశ్‌కుమార్‌రెడ్డి, ఆర్ అశ్విన్‌లు ఇన్నింగ్స్‌ని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కానీ మిచెల్ స్టార్క్ అశ్విన్ (22) ఎల్బీడబ్ల్యూని పెవిలియన్ పంపాడు. హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ సున్నాకి అవుటయ్యారు. భారత్ చివరి వికెట్ నితీష్ కుమార్ రెడ్డి రూపంలో పడింది. 54 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 42 పరుగుల ఇన్నింగ్స్ నితీశ్ కుమార్ రెడ్డి ఆడాడు.
Also Read: Andhra Pradesh: దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్…
THIS IS CINEMA! 🙌
Pink ball, seaming conditions & bowlers breathing fire – doesn't matter to #NitishReddy! 💪#AUSvINDOnStar 2nd Test 👉 LIVE NOW on Star Sports! #AUSvIND | #ToughestRivalry pic.twitter.com/IM9HaBrv63
— Star Sports (@StarSportsIndia) December 6, 2024
మ్యాచ్‌లో తొలి బంతికే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. మిచెల్ స్టార్క్ యశస్వి (0)ని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు. అనంతరం శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకుని రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. అయితే దీని తర్వాత భారత్ కేఎల్ రాహుల్ (37), విరాట్ కోహ్లీ (ఏడు), శుభ్‌మన్ గిల్ (31) వికెట్లను కోల్పోయింది. స్కాట్ బోలాండ్ చేతిలో గిల్ ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు