కర్నాటకలోని ఉడిపిలో టైరు పగిలి మెకానిక్ గాల్లోకి ఎగిరిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఉన్న టైర్ షాప్ మెకానిక్ స్కూల్ బస్సు టైర్‌ని పంచర్ వేసి గాలి నింపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టైరు పేలింది. దీంతో.. అక్కడే ఉన్న మెకానిక్ గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ క్రమంలో మెకానిక్ అబ్దుల్ రజీద్ (19)కు గాయాలయ్యాయి.
అసోం రాజధాని గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు తెలియలేదని శనివారం పోలీసులు తెలిపారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పేర్కొన్నారు.
Puspa Kissik Song: దేశవ్యాప్తంగా పుష్ప మానియా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్లలో రిలీజ్ అయిన పుష్ప మొదటి షో నుండే భారీ హిట్ సొంతం చేసుకొని రికార్డులు సృష్టిస్తోంది. ఇండస్ట్రీ ఏదైనా సరే పుష్ప గాడు తగ్గేదెలా అన్నట్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. మూడు రోజులలో 600 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్ప// 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇకపోతే మొదటి పార్ట్ లో సమంత చేసిన…
Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. జట్టులో తన స్థానాన్ని నిలుపుకోవడానికి వచ్చానని మూడు ఇన్నింగ్స్‌ల్లోనే తన ప్రదర్శనతో చూపించాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అతను 120కి పైగా పరుగులు చేశాడు. అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కూడా నితీష్ రెడ్డి అత్యధిక పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. తన ఇన్నింగ్స్ సమయంలో నితీష్…
Women Kidnap On Road: రాజస్థాన్ లోని బలోత్రాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. శుక్రవారం సాయంత్రం పచ్చపద్ర రోడ్డులోని పృథ్వీరాజ్ ధర్మకాంత సమీపంలో ఓ మహిళను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో నుంచి బలవంతంగా లాగి తమ కారులో ఎక్కించుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్నవారు కెమెరాలో రికార్డ్ చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపక్కన స్కార్పియో కారు ఆగడం, అందులో నుంచి కొందరు వ్యక్తులు వచ్చి…
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌పైనే క్రికెట్ అభిమానులందరి దృష్టి పడింది. ఈ సిరీస్‌లో విజయం సాధించాలని ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు మొదటి మ్యాచ్ పెర్త్‌లో మొదలవ్వగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్ప కూలింది.…
ప్రస్తుతం ఎంతో మంది తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ.. లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఫాలోవర్స్ మోజులో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు.
పెరూలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలాకాలో రెండు దేశీయ క్లబ్‌లు జువెటాడ్ బెల్లావిస్టా-ఫామిలియా చోకా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం జరుగుతుండగా, భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో.. రిఫరీ ఆటను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా.. పిడుగు పడింది.
నోయిడాలో ఓ మహిళ బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూల కుండీని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఓ దుకాణం బయట ఉంచిన పూల కుండీని దొంగిలిస్తున్న మహిళను కొందరు అడ్డుకోగా.. ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.
బీహార్‌లో మద్యంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో కల్తీ మద్యం దందా, అక్రమ మద్యం రవాణా పెరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 37 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు.