Lord Sri Krishna Art On Pencil Nib: నేడు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఉదయం పూటనే కృష్ణుని భక్తులు కృష్ణ మందిరాలకు చేరుకుని పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా భారతదేశంలో అనేకమంది భక్తులు ఈ పండుగను పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఇస్కాన్ మందిరాలలో భక్తులు పోటెత్తారు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ట్రెండింగ్ గా మారాయి. ఉమ్మడి విశాఖ…
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్ పై పడుకున్నట్లు.. రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అది కూడా.. కింద టవల్, పైన గొడుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ట్రాక్‌పై నిద్రిస్తున్న లోకో పైలట్ సకాలంలో చూసి బ్రేకులు వేసి అతని ప్రాణాలు కాపాడాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే చంపింది ఓ ఇల్లాలు. ఈ ఘటన గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అరెస్ట్ చేయగా.. మహిళ పరారీలో ఉంది.
నోయిడాలో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 94లో ఉన్న పోస్ట్‌మార్టం హౌస్‌లో అశ్లీల వీడియో బయటపడింది. ఓ ఉద్యోగి ఒక మహిళతో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అంతేగాక.. ఆ నీచ పనిని మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వీపర్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు.
Heart Attack Video: ఇండోర్‌లో వైద్యుడి వద్దకు చికిత్స కోసం వచ్చిన ఓ రోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో మృతికి సంబంధించిన వీడియో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గ్రహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని., పరదేశిపుర పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పంకజ్ ద్వివేది తెలిపారు. ఓ యువకుడు ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వచ్చినట్లు ఈ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది.…
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కొత్త అవతారమెత్తాడు. రిషబ్ పంత్ కెరీర్లో ఇప్పటివరకు చూడనిది ఈ మ్యాచ్‌లో కనిపించింది. రిషబ్ పంత్ కొన్ని క్షణాలు వేరే అవతారంలో కనిపించాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20ని ప్రారంభించింది. ఈ టీ20 టోర్నమెంట్లో రిషబ్ పంత్ ఆడుతున్నాడు. రిషబ్ పంత్ ఓల్డ్ ఢిల్లీ 6కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఫ్రాన్స్‌లో జరిగిన ఎయిర్‌షోలో అపశృతి చోటుచేసుకుంది. 65 ఏళ్ల పైలట్ విమానంతో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.
Bihar Birdge Collapse : బీహార్‌లో వంతెనలు కూలడం ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారింది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి.
పారిస్ ఒలింపిక్స్ లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, తన ఆనందం దానికే పరిమితం కాలేదు. స్వర్ణం గెలిచిన వెంటనే తోటి ఆటగాడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. డబుల్స్ ప్లేయర్ యుచెన్ మెకాళ్లపై కూర్చుని ఉంగరంతో ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో.. హువాంగ్ ఆశ్చర్యం, ఆనందంతో ఓకే చెప్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్ ఇదే…
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం విషయంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి వెజ్‌కి బదులు నాన్‌వెజ్ ఫుడ్ ఇవ్వడంతో ఓ ప్రయాణికుడు వెయిటర్‌పై చిరుబుర్రులాడాడు. అంతేకాకుండా.. కోపంతో వెయిటర్ని ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టాడు.