వచ్చే ఎన్నికల్లో తమ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే.. తూర్పుకాపుల జనగణన చేపడతామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరిలోని భీమవరంలో...
ఈరోజు ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కావాల్సింది ఉంది.. కానీ, ఉదయం జరగాల్సిన ఆ సమావేశం ఉన్నట్టుండి సాయంత్రానికి వాయిదా వేశారు.. సాయంత్రం 4 గంటలకు భీమవరంలో జనసేన నేతల మీటింగ్ ఉంటుందని తాజాగా ప్రకటించాయి జనసేన పార్టీ శ్రేణులు. అయితే, దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్ కల్యాణ్‌కు స్వల్ప అస్వస్థతకు గురికావడమే కారణంగా తెలుస్తోంది
జనసేన అధికారంలోకి వస్తే బటన్ నొక్కడం ఉండదు.. రెల్లి కార్మికులు చెత్త ఊడ్చినట్టు అవినీతిని అంతం చేస్తామని జనసేన చీఫ్ అన్నారు. పులివెందుల రాజకీయం గోదావరి జిల్లాల్లోకి తీసుకు వస్తామంటే సహించేది లేదు అని పవన్ అన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్ పోవాలి అని ఆయన వ్యాఖ్యనించారు. సీఎంగా వున్న వ్యక్తి ఎలాంటి త్యాగాలు చేయలేదు అని పవన్ కల్యాణ్ అన్నారు.
తన ఒంటిపై చేయి పడితే జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదన్నారు.