నాలుగో విడత యాత్ర ఇవాళ్టి నుంచి అవనిగడ్డ వేదికగా ప్రారంభం అవుతుంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర నేటి (ఆదివారం) నుంచి కృష్ణా జిల్లాలో కొనసాగనుంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవినగడ్డలోని శ్రీ అక్కటి దివాకర్ వీణా దేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో జనసేన అధ్వర్యంలో బహిరంగ సభ జరుగనుంది.
2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్టణం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించేందుకు వెళ్లనున్నారు.