పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు సజ్జల.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ సభ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు, మీటింగ్ కు వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లను అమలాపురం డీఎస్పీ సమీక్షించారు.
రాజకీయ స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తిని కాదు.. జనసేన ప్రభుత్వంలో ముస్లింల జీవన ప్రమాణస్థాయిని పెంచుతామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా జనసేన చూసుకుంటుంది అని కాకినాడలో జరిగిన ముస్లిం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేశారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం కాకినాడ నుంచి ముమ్మిడివరం వెళ్లనున్నారు.