Karumuri Nageswara Rao Comments On Pawan Kalyan: చంద్రబాబును సీఎం చేయాలనేది పవన్ అజెండా అని మంత్రి కారుమురి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తన్నేస్తాం, లాగేస్తాం, తాట తీస్తామంటూ పవన్ అంటున్నారని.. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎమ్మెల్యేలను తన్నేస్తారా? అని ప్రశ్నించారు. ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేసినప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదు? కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై ఎందుకు మాట్లాడలేదు? 40 దేవాలయాలను కూలదోస్తే ఎందుకు ఖండించలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నను గెలిపించుకోలేని వాడు.. ఇప్పుడు టీడీపీని ఏం గెలిపిస్తాడని చింతమనేని చేసిన వ్యాఖ్యాల్ని పవన్ ఎందుకు ఖండించలేదని అడిగారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే, తనను చంపేస్తారని ప్రజలను పవన్ మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు.
Kottu Satyanarayana: వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్.. పవన్ ప్రసంగాలు ఉన్మాదికి ఎక్కువ, పిచ్చికి తక్కువ
అంతకుముందు కూడా.. ఓట్ల కోసం కాకుండా ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని, అది చూసి తట్టుకోలేక చంద్రబాబు ఇంగ్లీష్ మీడియంను అడ్డుకునే ప్రయత్నం చేశారని మంత్రి కారుమూరి ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ కూడా తోడుగా నిలిచి, ఇంగ్లీష్ మీడియంను అడ్డుకోవాలని చూశారని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగన్ వెనకడుగు వేయరని తేల్చి చెప్పారు. 68 వేల కోట్ల నిధులను కేవలం విద్య కోసమే తమ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. విద్య కోసం ఇంకా చేయడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే తమ ప్రభుత్వ లక్ష్మమని, తప్పకుండా మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Titan tragedy: టైటాన్‌కి “టైటానిక్ శాపం” తగిలిందా..? పలు సంఘటనల ఆధారంగా రూమర్స్..