Pawan Kalyan: ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ నిర్మాణంపై కీలక సూచనలు చేస్తూ వస్తున్న ఆయన.. మరోవైపు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.. ఇలా వారాహి యాత్ర చేపట్టినాటి నుంచి నిత్యం ఏదో ఒక షెడ్యూల్‌లో గడుపుతున్నారు.. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈరోజు ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కావాల్సింది ఉంది.. కానీ, ఉదయం జరగాల్సిన ఆ సమావేశం ఉన్నట్టుండి సాయంత్రానికి వాయిదా వేశారు.. సాయంత్రం 4 గంటలకు భీమవరంలో జనసేన నేతల మీటింగ్ ఉంటుందని తాజాగా ప్రకటించాయి జనసేన పార్టీ శ్రేణులు. అయితే, దీనికి ప్రధాన కారణం జనసేనాని పవన్ కల్యాణ్‌కు స్వల్ప అస్వస్థతకు గురికావడమే కారణంగా తెలుస్తోంది. పవన్ అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్నారట.. దీంతో.. ఉదయం జరగాల్సిన సమావేశం కాస్త.. సాయంత్రానికి వాయిదా పడింది.
Read Also: NTR Fans: శ్యామ్ చెల్లెల బాధ్యత తీసుకున్న ఎన్టీఆర్ ఫాన్స్…
కాగా, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్ గా మారిపోయింది వారాహి యాత్ర.. ప్రభుత్వం, పాలకులపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. రోజుకో ఇష్యూలా.. విమర్శలు గుప్పిస్తున్నారు.. నేతలను టార్గెట్ చ ఏస్తున్నారు.. అన్నవరం నుంచి మొదలైన ఈ యాత్ర కోనసీమ జిల్లా దాటుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. వారాహి వాహనం మీదెక్కి పవన్ వెళ్తుంటే.. ఆయన్ని చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. చాలాచోట్ల పవన్ కు జనసైనికులు, వీర మహిళలు హారతులు పడుతున్నారు. ఇక, జనసేనాని విమర్శలకు అధికార పార్టీ నుంచి అదేస్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి.. మంత్రులు, నేతలు, ప్రజాప్రతినిధులు అంతా.. పవన్‌పై విమర్శలు కురిపిస్తున్న విషయం విదితమే.