Pawan Kalyan Speech In Bhimavaram Public Speech: వచ్చే ఎన్నికల్లో తమ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే.. తూర్పుకాపుల జనగణన చేపడతామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరిలోని భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పుకాపుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి బీజం పడింది భీమవరంలోనేనని చెప్పారు. 2014లో తన పోరాటయాత్ర శ్రీకాకుళం నుంచే మొదలుపెట్టానని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ వలస కార్మికులు వస్తుంటారని, ఉత్తరాంధ్ర కార్మికులు సాహసికులని పేర్కొన్నారు. తూర్పుకాపుల సంఖ్యను టీడీపీ 26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం 16 లక్షలని చెబుతున్నారని, కానీ నిజానికి 45 లక్షల మంది తూర్పుకాపులు ఉన్నారని పవన్ వివరించారు. మరి, ఏ ప్రాతిపదికన వైసీపీ 16 లక్షలే ఉన్నారని చెబుతోందంటూ ప్రశ్నించారు. వారికి పథకాలు అందకుండా చేయడానికే వైసీపీ అలా అంటోందని ఆరోపించారు.
Nandigam Suresh: ఎంపీ నందిగం సురేష్ సవాల్.. బాబు, లోకేష్, పవన్‌లలో ఎవరొచ్చినా రెడీ
చట్టంలో అందరికీ న్యాయం జరిగితే, కులాలతో సంబంధం లేదని.. కానీ చట్టం పనిచేయనప్పుడు మాత్రం అందరం కులాల వైపు చూస్తామని పవన్ వ్యాఖ్యానించారు. తూర్పుకాపుల్లో బలమైన నాయకులు ఉన్నారని.. అయితే వాళ్లు ఎదుగుతున్నారే తప్ప, కులాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆలోచించాలని సూచించారు. తూర్పుకాపుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని.. తాము తిన్న తర్వాతైనా కులం గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఇతర బీసీ కులాలకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు, తూర్పుకాపులకు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. ఇవ్వకపోవడానికి హేతుబద్ధత ఏమిటి? అని నిలదీశారు. తెలంగాణాలో 31 కులాలను బీసీ జాబితా నుంచి తూర్పుకాపులను తొలగించారని, అయినా అప్పటి నాయకులు పట్టించుకోలేదని పవన్ విరుచుకుపడ్డారు. ఈ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల జనగణనకు తాను అనుకూలంగా ఉన్నానని అన్నారు.
Triple Talaq: ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన ఇస్లామిక్ దేశాలు ఇవే..
అయినా తాను సీఎం అయితే, అన్ని సమస్యలూ పరిష్కారమవ్వమని.. సీఎం అవ్వడం అన్నింటికి మంత్రదండం కాదని పవన్ కళ్యాణ్ చమత్కరించారు. తాను సీఎం అయ్యాక.. అధికారులో, నాయకులో కచ్ఛితంగా అడ్డుపడతారన్నారు. కేవలం చైతన్యవంతమైన సమాజంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తాను సీఎం అయ్యాక, తనని నిలదీసే స్థితికి ప్రజలు రావాలన్నారు. కానీ.. ఇప్పుడు కేసు పెట్టాలన్నా, ఎమ్మెల్యేలు అడ్డుపడే పరిస్థితి ఉందన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని అభీష్టించారు. ఒక్క ఎమ్మెల్యే పని చేయడని, ప్రశ్నిస్తే బూతులు తిడతారని విరుచుకుపడ్డారు. దేశంలో ‘కులం’ బలంగా మారడానికి.. వ్యవస్థలు సరిగా పని చేయకపోవడమే కారణమన్నారు. తనకు రాత్రి నుంచి జ్వరం ఉన్నా.. మీ అందరినీ చూశాక ఎలా అయినా రావాలని ఇక్కడివరకు వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.