వారాహి యాత్రపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సినిమా మొదలు పెట్టేటప్పుడు క్లాప్ కొట్టి చెప్పే డైలాగుల్లా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. నాకు అధికారం అవసరం లేదు... ముఖ్యమంత్రి చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఇంకేంటి ప్రజల్లోకి వెళ్ళేదంటూ ప్రశ్నించారు. ఇది చంద్రయాత్ర అని ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబును పొగడటమే పవన్ కళ్యాణ్ పని అంటూ కామెంట్స్ చేశారు.