జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో మార్పు కోసం పోరాడుతున్నానని.. ఈ పోరాటంలో తన ప్రాణాలు పోవచ్చు అని అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఇవాళ (సోమవారం) పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బీఆర్ అంబేద్కర్ జంక్షన్‌లో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతల స్పూర్తితో పరిపాలన జరగాలని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై నాకు వ్యక్తిగత కక్ష, ద్వేషం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో ఎంతమందికి జగన్ ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి వచ్చిన కంపెనీలు వెనక్కి పోతున్నాయని.. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నారని పవన్ ప్రశ్నించారు.
Read Also: Char Dham Yatra: నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర.. అధికారులకు సీఎం ఆదేశాలు
జనసేన అధికారంలోకి వస్తే బటన్ నొక్కడం ఉండదు.. రెల్లి కార్మికులు చెత్త ఊడ్చినట్టు అవినీతిని అంతం చేస్తామని జనసేన చీఫ్ అన్నారు. పులివెందుల రాజకీయం గోదావరి జిల్లాల్లోకి తీసుకు వస్తామంటే సహించేది లేదు అని పవన్ అన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్ పోవాలి అని ఆయన వ్యాఖ్యనించారు. సీఎంగా వున్న వ్యక్తి ఎలాంటి త్యాగాలు చేయలేదు అని పవన్ కల్యాణ్ అన్నారు. అన్యాయంపై ఎదురు తిరగాలని మనకు స్కూల్లలోనే నేర్పించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సహజవనరులను కొందరు నేతలు కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కనీస వసతులు అందరికీ అందాలని, అది ప్రాథమిక హక్కని జనసేనాని చీఫ్ పేర్కొన్నారు. ప్రాథమిక సౌకర్యాలు లేకుంటే ప్రజలు ఉద్యమం చేస్తారని జనసేనాని హెచ్చరించారు. అవినీతి, దోపిడీయే లక్ష్యంగా కొందరు నేతలు పరిపాలిస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరో ఒకరు మొదలు పెట్టకపోతే సమాజంలో మార్పు రాదన్నారు.
Read Also: Delhi Metro: 15 గంటల్లో 286 స్టేషన్లు కవర్ చేసిన ఓ వ్యక్తి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!
రాష్ట్రాన్ని, వనరులను ముఖ్యమంత్రి, మంత్రులు దోపిడీ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జగన్ పాలనలో దళితులను చంపిన హంతకులు బయటే తిరుగుతున్నారని ఆయన అన్నారు. కొందరు దిగజారి తనను బూతులు తిడుతున్నారని.. తాను ఎప్పుడు గొంతెత్తినా తన కోసం కాదన్నారు. అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం వరకు 28 ఆలయాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని పవన్ చెప్పారు. ఏపీ అభివృద్ధి జనసేనతో సాధ్యం అని అన్నారు.
రిజర్వేషన్లు పేరుతో కాపులకు, బీసీలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు అని పవన్ కల్యాణ్ అన్నారు.