Pawan Kalyan: ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరకూడదంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాల నుంచే వారాహి యాత్ర చేపట్టిన పవన్.. ప్రతీ సమావేశం, ప్రతీ మీటింగ్, ప్రతి బహిరంగసభలో.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు.. ఏ నియోజకవర్గానికి వెళ్తే.. అక్కడి స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించడంతో పాటు.. సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు, నేతలను ఎవ్వరినీ వదలడంలేదు.. అయితే, ఈ రోజ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు 150 మంది వివిధ పార్టీలు చెందిన నాయకులు, కార్యకర్తలు.. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి సమర్థత ఉన్నవాళ్లు మరింతమంది రావాలని నా ఆకాంక్షగా పేర్కొన్న ఆయన.. నేరస్థులను ఎదుర్కోవాలంటే చట్టాలపై అవగాహన ఉన్నవాళ్లు కావాలన్నారు.. ఇక, వచ్చే నెల 5, 6 తేదీల్లో రాజమండ్రిలో జనసేన పార్టీ సమావేశం నిర్వహిస్తాం అని వెల్లడించారు.. అయితే, రాబోయే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకూడదు అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.
Also Read
కాగా, వారాహి యాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు భీమవరం అంబేద్కర్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.. సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రసంగించనున్నారు.. ఇక, అనంతరం భీమవరం నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు.. మరోవైపు.. 6వ తేదీ తర్వాత తిరిగి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తంగా.. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓవైపు.. జనసేనాని వ్యాఖ్యలకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కౌంటర్ ఎటాక్ మరోవైపుతో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. మరోవైపు, భీమవరం బహిరంగ సభలో పవన్ కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. మరోసారి భీమవరం నుంచి తాను పోటీ చేసే విషయంపై ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!