రష్యాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతున్నది. ప్రతిరోజూ వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను రష్యా మొదటగా తయారు చేసినప్పటికీ, వ్యాక్సినేషన్ మిగతా దేశాలతో పోలిస్తే మందకోడిగా సాగుతున్నది. దీంతో కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులను వారం రోజులపాటు పని ప్రదేశాలకు దూరంగా ఉంచితే మంచిదని ప్రభుత్వం భావించింది. అక్టోబర్ 30…
సాధారణంగా ఎన్నికలు జరిగే సమయంలో ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తుంటారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చెక్ చెస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి రాజాపురం తదితర ప్రాంతాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాపురం గ్రామంలోకి ప్రవేశించే శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ మార్గం గుండా వచ్చి వెళ్లే…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో వేగంగా జరుగుతోంది. వ్యాక్సిన్ పంపిణీలో అరుదైన రికార్డుకు భారత్ అడుగు దూరంలో ఉంది. దేశంలో ఇప్పటి వరకు 99కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 99 కోట్ల డోసులు దాటినట్లు… కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ ట్వీట్ చేశారు. ఇవాల్టితో..1 00కోట్ల డోసులు పూర్తి కానున్నాయి. అదే జరిగితే చైనా తర్వాత 100కోట్ల డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్ అరుదైన…
తెలంగాణ కరోనా పరిస్థితులు మరియు వ్యాక్సినేషన్ పై రాష్ట్ర వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణా లో ఒకట్రెండు రోజుల్లో 3 కోట్ల డోసులు వాక్సినేషన్ పూర్తి కానుందని.. 75 శాతం మందికి మొదటి డోస్ అలాగే… 39 శాతం రెండో డోస్ పూర్తయిందని వెల్లడిచింది ఆరోగ్య శాఖ. 50 లక్షల వాక్సిన్ నిల్వ తెలంగాణ లో ఉందని… 0.4 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదైందని పేర్కొంది. ప్రస్తుతం కోవిడ్ అదుపులో ఉందని… వాక్సిన్ వల్ల…
కరోనా మహమ్మారికి ప్రపంచ వ్యాప్తంగా 49 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాస్త్రవేత్తల నిరంతర శ్రమ కారణంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మహమ్మారులకు వ్యాక్సన్‌ను తయారు చేయాలి అంటే కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది. కానీ, కరోనా నుంచి కోలుకోవాలి అంటే వ్యాక్సిన్ తప్పనిసరి కావడంతో ప్రపంచం మొత్తం వ్యాక్సిన్‌పైనే దృష్టి సారించింది. ఆరునెలల కాలంలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత…
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. కొన్ని సార్లు ప్రత్యేక డ్రైవ్ ద్వారా విస్తృతంగా వ్యాక్సిన్ వేస్తున్నారు అధికారులు.. అయితే, బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మరికొన్ని రోజులు వ్యాక్సినేషన్‌కు సెలవులు ప్రకటించారు అధికారులు.. రేపు అనగా 14వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు, 14వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే టీకాలు తీసుకొవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా టీకాలు అమలు చేస్తున్నారు. టీకాలు తీసుకున్నాక శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఈ యాంటీబాడీలు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. టీకాలు తీసుకున్నాక చాలా మందికి కరోనా సోకుతున్నది. అలాంటి కేసులను బ్రేక్‌త్రూ కేసులుగా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు అధికంగా నమోదవుతుండటంతో అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. 16 రకాల వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్థవంతంగా…
ప్రపంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. గుజరాత్ కేంద్రంగా జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇప్పటికే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడంతో జైడస్ క్యాడిలా జైకొవ్ డి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఈనెల 20 వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. మూడు డోసుల వ్యాక్సిన్ కావడం విశేషం. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సిరంజితో…
కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో కరోనాను పూర్తిగా దేశం నుంచి తరిమికొట్టి జీరో కరోనా దేశంగా గుర్తింపు పొందింది న్యూజిలాండ్. అయితే, ఇటీవలే అక్లాండ్‌లో డెల్టా కేసు ఒకటి బయటపడటంతో వెంటనే దేశంలో మూడు రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. కాగా, ఇప్పుడు ఇదే విధమైన మరో కఠిన నిర్ణయం తీసుకున్నది న్యూజిలాండ్…
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సినేషన్ కోసం వినియోగించే సిరంజీల ఎగుమతులపై మూడు నెలల పాటు పరిమితులు విధించింది. మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించింది కేంద్రం. దేశంలోని అర్హులైన అందరికి వ్యాక్సిన్ అందించే క్రమంలో సిరంజీల స్టాకును పెంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. తక్కువ సమయంలో ఎక్కువ వ్యాక్సిన్‌లు అందించాలనే లక్ష్యంలో భాగంగానే…