ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. రాష్ట్రంలో కరోనా రోజువారి కేసుల సంఖ్య ఓసారి కిందకు.. మరోసారి పైకి కదులుతూనే ఉంది.. అయితే, కరోనాపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన సీఎం వైఎస్ జగన్.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తూ.. తగిన ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతం కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల టీకా వేసినట్టు…
దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మూడో వేవ్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడటం లేదు. వ్యాక్సిన్ తీసుకోకుంటే ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. Read: తగ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా సరిహద్దుల్లో… ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని, థానే…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి కొంత ఉపమనం కలిగిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య తగ్గిపోయింది. కరోనా వైరస్ సోకినా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే బయటపడుతున్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వీరి కోసం ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి వ్యాక్సిన్…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ విజయ వంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఏకైక మార్గం.. వ్యాక్సినేషన్ కాబట్టి… అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ విజయ వంతంగా అమలు చేస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ.. కరోనా వ్యాక్సినేషన్ విజయం వంతంగా ముందుకు సాగుతోంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 65 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నేడు కరోనా వ్యాక్సినేషన్ బంద్ కానుంది. దీపావళి పండుగ సందర్భంగా టీకాల పంపిణీకి…
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. 12 ఏళ్లకు పైబడిన వారికి అక్కడ వ్యాక్సిన్ ఇప్పటికే అందిస్తున్నారు. కాగా 5-11 ఏళ్ల వయసున్న చిన్నారులకు వ్యాక్సిన్ అందించబోతున్నారు. ఫైజర్ ఎన్ బయోటెక్ సంస్థ తయారు చేసిన చిన్నారుల ఫైజర్ టీకాకు ఎఫ్‌డీఎ అనుమతులు మంజూరు చేసింది. Read: వైరల్: మృగాడి నుంచి కుక్కను కాపాడిన గోమాత… దీంతో ఈ…
కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ప్రపంచం అంతా కుదేలయింది. అనంతర కాలంలోనే ఆయా ఫార్మా కంపెనీలు కరోనా నివారణకు టీకాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇంకా కొన్ని పరీక్షలు వాటికి సంబంధించిన ఇతర అనుమతులకు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా జైడస్ కంపెనీ తయారు చేసిన జైకొవ్-డి- వ్యాక్సిన్ రూ.265 కే అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ప్రజలకు వ్యాక్సిన్‌ను మరింత దగ్గర చేసేలా ఆ కంపెనీ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ఇప్పటికే మన దేశంలో సీరం ఇన్‌స్ట్యూట్…
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికి…వైరస్ సోకుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా.. ఇక నిశ్చితంగా ఉండొచ్చన్న భావన వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగపూర్‌లో 84 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకున్నప్పటికీ…రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో 14శాతం మంది బూస్టర్ టీకాలు కూడా వేయించుకున్నారు. ఊహించని విధంగా కేసులు నమోదవుతుండటంతో…ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 16 మంది కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. చనిపోయినవాళ్లలో 44…
వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన భారత ప్రభుత్వం.. ఈ ఏడాదిలోనే 100 శాతం వ్యాక్సినేషన్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.. అయితే, ఇంకా ప్రజలను అపోహలు వెంటాడుతూనే ఉన్నాయి.. కొందరు ఫస్ట్ డేసు వేసుకోవడానికే ముందుకు రాకపోగా.. మరోవైపు.. ఫస్ట్ డోస్ తర్వాత రెండో డోసు తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.. ఇటీవలే వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. కానీ, ఫస్ట్ డోసు, సెకండ్ డోసులు…
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో విస్తృతంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. సోషల్ మీడియా వేదికగా కొందరు ఫేక్‌గాళ్లు.. వ్యాక్సినేషన్‌పై తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు. ఇది నిజమా..? అబద్ధమా..? అని నిర్ధారణకు రాకుండానే.. చాలా మంది లైక్‌లు, షేర్లతో అది కాస్త వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల (నవంబర్ 1వ తేదీ) నుంచి రేషన్, పింఛన్ నిలిపివేసే ఆలోచనలో వైద్యారోగ్య శాఖ ఉందంటూ..…