US: జోసెఫ్ కెంట్ రాజీనామాపై వైట్‌హౌస్ కీలక ప్రకటన.. వార్ మేటర్ లీక్‌పై సంచలన నిర్ణయం
- మంటరేపుతోన్న జోసెఫ్ కెంట్ రాజీనామా
- జోసెఫ్ కెంట్ రాజీనామాపై స్పందించిన వైట్‌హౌస్
- అంతర్గత దర్యాప్తు జరుగుతోందని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక అధిపతి జోసెఫ్ కెంట్ రాజీనామా ట్రంప్ ప్రభుత్వంలో తీవ్ర అలజడి సృష్టించింది. ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేయడం ఏ మాత్రం ఇష్టం లేదంటూ జోసెఫ్ కెంట్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతర్జాతీయంగా పెను సృష్టించింది.

Also Read
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
తాజాగా జోసెఫ్ కెంట్ రాజీనామాపై వైట్‌హౌస్ స్పందించింది. ఇరాన్ ఆపరేషన్‌తో కెంట్‌కు ఎలాంటి సంబంధం లేదని.. ఎనిమిది నెలల కన్నా తక్కువ కాలం పాటు ఉగ్రవాద నిరోధక సంస్థకు నాయకత్వం వహించారని తెలిపింది. ఇక ప్రభుత్వంలో సమాచారం లీక్ చేసిన వారిని కనుకొనేందుకు అంతర్గత విచారణ జరుగుతోందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు.
అంతర్గత విభేదాలపై ప్రశ్నలు పెరుగుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌పై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా నాయకత్వంలో ఐక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. అంతర్గత వివరాలను ఎవరు లీక్ చేసి ఉండవచ్చో గుర్తించడంపై ఇప్పుడు దృష్టి సారించామని లీవిట్ సూచించారు.
జోసెఫ్ కెంట్..
అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక అధిపతి జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో సంచలన విషయాలు వెల్లడించారు. తన మనస్సాక్షికి విరుద్ధంగా ఇరాన్‌తో యుద్ధానికి మద్దతు ఇవ్వలేనని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు ఉండబోదని పేర్కొన్నారు.
పశ్చిమాసియా యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి, దేశ సంపదను హరించివేస్తాయనే విషయం ట్రంప్‌కు 2025 జూన్ వరకు తెలుసని తన లేఖలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావవంతమైన సభ్యులు. ఒక తప్పుడు సమాచారం ద్వారా ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రోత్సహించారని తెలిపారు. ట్రంప్‌పై ‘‘ఎకో ఛాంబర్’’ను ఉపయోగించారని కెంట్ ఆరోపించారు. ఇరాన్‌తో యుద్ధం ముగించుకుంటే మంచిదని.. లేదంటే దేశాన్ని మరింత గందరగోళంలోకి నెట్టగలరని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!