ప్రపంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. గుజరాత్ కేంద్రంగా జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇప్పటికే డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడంతో జైడస్ క్యాడిలా జైకొవ్ డి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఈనెల 20 వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది. మూడు డోసుల వ్యాక్సిన్ కావడం విశేషం. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సిరంజితో అవసరం ఉండదని ప్రాధమికంగా తెలుస్తున్నది. నెలకు కోటి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనున్నట్టు ఫార్మా సంస్థ తెలియజేసింది. 25 శాతం టీకాలను ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. అయితే, దీని ధరను ఫార్మా సంస్థ ప్రకటించాల్సి ఉన్నది.
Read: ఇవాళ బెజవాడ దుర్గమ్మ ఆలయానికి సీఎం జగన్…