కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో వేగంగా జరుగుతోంది. వ్యాక్సిన్ పంపిణీలో అరుదైన రికార్డుకు భారత్ అడుగు దూరంలో ఉంది. దేశంలో ఇప్పటి వరకు 99కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 99 కోట్ల డోసులు దాటినట్లు… కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ ట్వీట్ చేశారు. ఇవాల్టితో..1 00కోట్ల డోసులు పూర్తి కానున్నాయి. అదే జరిగితే చైనా తర్వాత 100కోట్ల డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్ అరుదైన గుర్తింపు సాధించనుంది. వైరస్‌ను అరికట్టేందుకు… టీకా కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది.
తొలినాళ్లలో డోసుల కొరత, ఇతరత్రా కారణాలతో నెమ్మదిగా సాగిన వ్యాక్సినేషన్.. కరోనా రెండో దశ నుంచి వేగం పుంజుకుంది. టీకా పంపిణీలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 12కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. మహారాష్ట్ర 9 కోట్లకు డోసులను పూర్తి చేసింది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, కర్ణాటక, రాజస్థాన్ ఉన్నాయి.. మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి… మరోవైపు.. వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్క్‌ను దాటినే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో దానిపై చర్చించనున్నారు.