దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నది. మెగా క్యాంపులు నిర్వహిస్తూ వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇక కరూర్ జిల్లాలో వ్యాక్సిన్‌పై వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఎక్కవ మంది వ్యాక్సిన్ వేయించుకునేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారం వారం మెగా వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహిస్తున్న ప్రభుత్వం, రాబోయే ఆదివారం రోజున కూడా మెగా క్యాంపును నిర్వహిస్తోంది. వాలంటీర్లు ఎంత మందిని వ్యాక్సిన్ తీసుకోవాడానికి తీసుకొస్తే వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అందించనున్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి…
చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. యాత్రకు వచ్చే రోజువారీ భక్తుల పరిమితిని ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసింది… దీంతో… కీలక సూచనలు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా తీసుకున్న సర్టిఫికెట్ కానీ, 72 గంటలకు మించకుండా కోవిడ్ నెగటివ్ రిపోర్టు చూపించాలని రూల్స్ పెట్టింది. చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తులు వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది సర్కార్. కాగా, హిమాలయ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ భక్తుల…
భారత్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే అంశంపై వచ్చే వారం ప్రపంచ ఆరోగ్యసంస్థ తుది నిర్ణయం తీసుకోనున్నది. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుపులు వచ్చేవారం సమావేశం కాబోతున్నారు. టీకాకు సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ అందజేసింది. దీనితో పాటుగా సెప్టెంబర్ 27 వ తేదీన అదనపు డేడాను కూడా భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్యకు అందజేసింది. దేశంలో ఇప్పటికే కోవాగ్జిన్…
భారత్-యుకే మధ్య వ్యాక్సిన్ వార్ షురూ అయింది. భారత్‌లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తాము గుర్తించడం లేదంటూ…కొన్ని రోజుల క్రితం బ్రిటన్ ప్రకటించింది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా…భారత్ నుంచి బ్రిటన్ వచ్చే వారికి 10రోజుల క్వారంటైన్ తప్పనిసరంటూ అక్కడి ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీన్ని ఖండించిన భారత్…ఈ నిబంధనలు వివక్షపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బ్రిటన్ వెనక్కి తగ్గకపోవడంతో…భారత్ దీటుగా స్పందించింది. అక్కడ నుంచి వచ్చే పౌరులపైనా ఆంక్షలకు సిద్ధమైంది. బ్రిటన్ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో…
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. కరోనా టెస్ట్‌లతో పాటు.. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఆదేశాలిచ్చింది.. కరోనా పరిస్థితులపై ఇవాళ విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. వ్యాక్సినేషన్ 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.. ఇక, విద్యాసంస్థల్లో సిబ్బందికి 2 నెలల్లో వ్యాక్సిన్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది ధర్మాసనం.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు సైతం పెంచాలని ఆదేశాలు జారీచేసింది. కాగా, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ…
అమెరికా వెళ్లేవారికి అక్కడి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ అమెరికాలోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్న వారికీ మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇందులో మోడెర్నా, ఫైజర్ ఎన్ బయోటెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనకా, కొవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు అమెరికా సీడీసీ తెలియజేసింది. నవంబర్ నుంచి నిబంధనలకు లోబడి టీకాలు…
కరోనాపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ఊపందుకుంది.. ఒకప్పుడు రోజుకు లక్షల్లో డోసులు వేసే స్థాయి నుంచి ఇప్పుడు ఒకేరోజులో రెండు కోట్లకుపైగా వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించింది భారత్.. ఇక, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అర్హులైన జనాభా అంతటికీ కనీసం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించాలనే లక్ష్యం నెరవేరేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.…
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కోరలు చాస్తూనే ఉన్నది. అమెరికాతో పాటుగా అటు ఆస్ట్రేలియాలో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్‌లో కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేశారు. నిర్మాణ కార్మికులు కనీసం ఒక్క డోసు తప్పనిసరిగా తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారినే నిర్మాణ పనులకు హాజరుకావాలని ఆదేశించింది. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వందలాది మంది నిర్మాణకార్మికులు మెల్‌బోర్న్ రోడ్లపైకి…
కరోనా సమయంలో వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం వేగవంతం చేసింది. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం కావడంతో ప్రజలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఉత్తర ప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన రామ్‌పాల్ సింగ్ అనే వ్యక్తి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాడు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక సదరు వ్యక్తి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. కాగా, అందులో ఐదు డోసులు తీసుకున్నట్టుగా ఉండటంతో షాక్ అయ్యాడు. మార్చి 16న…
కేరళలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్‌ను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, 84 ఏళ్ల వృద్ధురాలికి అరగంట వ్యవధిలో కోవీషీల్డ్ రెండు డోసులు ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఎర్నాకులం జిల్లాలోని అలువా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ఘటన జరిగింది. 84 ఏళ్ల తుండమ్మ అనే మహిళ తన…