Nandyal Mu*rder: నంద్యాలలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఇలా దొరికిపోయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal Mu*rder: నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడు ఇలియాస్ తో కలిసి భర్త అరిఫ్ ను దారుణంగా హత్య చేసింది భార్య.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణ శివారులోని నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్డు కుందూనదిలో అనుమానాస్పద స్థితిలో 4 రోజుల క్రితం లభ్యమైన అరిఫ్ మృతదేహం వాస్తవానికి హత్య కావొచ్చు.. అతని భార్య చెప్పిన ఆత్మహత్య కథనం అసత్యమని పోలీసులకు అనుమానం వచ్చింది..
Read Also: Modi-Sonia Gandhi: ఒకే ఫ్రేమ్‌లో మోడీ-సోనియాగాంధీ.. ఫొటో వైరల్
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
అయితే, మద్యం అతిగా తాగినందుకు తన భర్తను మందలించాను, అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడని భర్త మృతిపై పోలీసులకు వివరణ ఇచ్చింది భార్య.. కానీ, అరిఫ్ సోదరి ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో హత్య జరిగినట్లు వివరణలు వెలుగులోకి వచ్చాయి. కాగా, నూనెపల్లెకు చెందిన పెయింటర్ అరిఫ్ కి నిందితురాలైన మహిళతో 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కానీ, ఆమె.. ఇలియాస్ (అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి) మధ్య మద్య వివాహేతర సంబంధం ఏర్పడింది.. అరిఫ్ ను అడ్డుకోడానికి ఇలియాస్ కలిసి ప్లాన్ చేసింది భార్య.. ప్లాన్‌లో భాగంగా అరిఫ్ కు అధికంగా మద్యం తాగించి, కొట్టి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అరిఫ్ మృతదేహాన్ని కుందూ నదిలో విసిరేశారు, తద్వారా ఆత్మహత్య గా చిత్రీకరించటానికి ప్రయత్నించారు. అయితే, మృతదేహంపై గాయాలు గుర్తించిన రెహనా ఫిర్యాదుతో లోతుగా దర్యాప్తు చేసిన త్రీ టౌన్ పోలీసులు అసలు వాస్తవాన్ని వెల్లడించారు.. పోలీసుల విచారణలో అసలు విషయాన్ని అంగీకరించింది నిందితురాలు.. భార్య, ప్రియుడితో పాటు.. వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా నంద్యాల త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..