వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది.. 95 రోజుల్లోనే 13 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది.. అయితే, వయో వృద్ధులు, వికలాంగులకు, వీల్‌చైర్‌కే పరిమితం అయినవారికి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలని బాంబే హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది.. అయితే, వ్యాక్సీన్ ఇంటింటికీ తీసుకెళ్లి ఇవ్వడం సాధ్యం కాదని బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది కేంద్రం.. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తే తలెత్తే సమస్యలపై వివరాలను హైకోర్టుకు అందజేసింది.. కాగా, ధృతి కపాడియా, కునాల్ తివారీలు…
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోవడంతో అనేక జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ కావాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు ఉదయం రాష్ట్రానికి 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 7.5 లక్షల డోసులు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 6 లక్షల డోసులను అవసరమైన జిల్లాలకు ప్రభుత్వం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉదృతంగా ఉండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే అర్హులైన అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పటికే దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద సంఖ్యలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. దాదాపుగా ఇప్పటి వరకు దేశంలో 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఎంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ లను అందిస్తున్నారో అదే లెవల్లో వ్యాక్సిన్ వృధా అవుతున్నది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. వ్యాక్సిన్ వృధాపై ప్రధాని మోడీ అసంతృప్తి…
మే 1 వ తేదీ నుంచి దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కాబోతున్నది. మూడో విడత వ్యాక్సినేషన్ కు సంబంధించిన ప్రకటనను నిన్నటి రోజున కేంద్రం రిలీజ్ చేసింది. 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులు అందరికి వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నామమాత్రపు ధరలతో…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి భయానకంగా మారింది. రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఇంకా భయం వెంటాడుతూనే ఉన్నది. పైగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఇబ్బందులు పెడుతున్నది. పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ అందించాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తగినన్ని వ్యాక్సిన్ సరఫరా కాకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ నిర్వహించినా వ్యాక్సిన్ లేమి కారణంగా అరకొరగా మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. వ్యాక్సిన్ కొరతకు…
దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండియాలో కొనసాగుతోంది. అయితే, వ్యాక్సిన్ కోసం అనేకమంది భారతీయులు నేపాల్ బాటపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు, అనేకమంది భారతీయులు చైనాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. చైనాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలానే చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు . ఎవరైనా సరే చైనాలో అడుగుపెట్టాలి అంటే చైనా వ్యాక్సిన్…
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. రోజుకు లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ కు డిమాండ్ ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో కొరతను ఎదుర్కొంటున్నారు. తగినన్ని వ్యాక్సిన్లు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉన్నది. దీంతో అర్హులైన వారికి జాగ్రత్తగా వ్యాక్సిన్…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు రెండు రకాల వ్యాక్సిన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు కూడా ఇండియా అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఇండియాలో మరో వ్యాక్సిన్ కూడా రెడీ అయ్యింది. అయితే, ఇది అలోపతి కాదు, హోమియోపతి వ్యాక్సిన్. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా ఇండియాలో హోమియోపతి వ్యాక్సిన్ తయారు చేసినట్టు లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్…
కరోనా కేసులు ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చెందుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకాలను వేగవంతం చేసింది ప్రపంచం. ఎప్పుడైతే రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను తయారు చేశామని ప్రకటించిందో అప్పటి నుంచి ప్రపంచంలోని టాప్ దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇండియాలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, ప్రపంచదేశాల్లో వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇజ్రాయిల్ తమ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో అందరికంటే ముందు నిలిచింది. 90 లక్షల…
జనవరి 16 వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలివిడతలో ఆరోగ్యకార్యకర్తలకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలివిడతలో మొత్తం మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా, రెండో విడతలో వృద్దులకు కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 1 వ తేదీ నుంచి దేశంలోని 60 ఏళ్ళకు…