దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన మళ్లీ మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. 30వేల దిగువకు వచ్చిన కేసులు.. గత 24 గంటల్లో 34,403 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 320 మంది మరణించారు. ముఖ్యంగా కేరళలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ 34,403 కేసుల్లో దాదాపు 65 శాతం కేసులు కేరళ నుంచి నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళలో 22,182 కోవిడ్ -19 కేసులు…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగుతోంది.. మొదటగా కోవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు.…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ప్రపంచంలో అనేక రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి తయారినీ బట్టి కరోనా వైరస్ ను అడ్డుకునే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్లు మూడు నెలల పాటు కరోనా మహమ్మారికి అడ్డుకోగలిగితే మరికొన్ని ఆరు నెలల వరకు వైరస్‌ను అడ్డుకోగలుగుతాయి. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఆరు నెలల వరకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, బలమైన…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం కావడంతో దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఈ మొబైల్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. రాబోయే 15 రోజుల…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలుచేస్తున్నారు. ప్రతిరోజూ 60 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా ఇప్పుడు ఇండియా వ్యాక్సినేషన్‌లో వరల్డ్ రికార్డ్‌ను సాధించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 75,89,12,277 మందికి టీకాలు అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ వరకు దేశంలో పురుషులకు 52.5 శాతం, మహిళలకు 47.5శాతం ఇతరులకు 0.02 శాతం డోసులు వేసినట్టుగా కేంద్రం పేర్కొన్నది.…
వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో… ఇండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 75 కోట్ల డోసుల టీకా పూర్తైంది. వ్యాక్సినేషన్ మొదలయ్యాక, తొలి 10 కోట్ల డోసులు పూర్తవ్వడానికి 85 రోజులు పడితే, ఇప్పుడు కేవలం 13 రోజుల్లో 10 కోట్ల డోసులు పూర్తి చేశారు. ఈ రికార్డుతో వ్యాక్సినేషన్ డ్రైవ్ 75 కోట్ల డోసుల మైలురాయిని క్రాస్ చేసింది. డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 43 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది కేంద్రం. ఇక..మూడు…
కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని.. రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున.. మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ,…
అమెరికాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వ్యాక్సిన్ల కొరత లేనప్పటికీ మతపరమైన కారణాలు, ఇతర సొంత కారణాల వలన వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై వివక్ష మొదలైంది. ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కొన్ని ట్యాక్సీ సంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా…
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉండటంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాతో మరణించే అవకాశాలు 11రెట్లు తక్కువగా ఉంటుందని, టీకాలు తీసుకోని వారితో పోల్చితే తీసుకున్న వారు ఆసుపత్రిలో చేరే అవకాశాలు కూడా 10రెట్లు తక్కువగా…
ఇండియాలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్న కొన్ని రాష్ట్రాల్లో జోరుగానే ఉంది. అక్కడక్కడా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక కేరళలో పరిస్థితి కంట్రోల్‌లో లేదు. మిగితా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మాత్రం కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో సగం కేరళలోనే వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 25,010 కరోనా కేసులు నమోదు కాగా, 177 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 2.37 లక్షల కరోనా యాక్టీవ్ కేసులు ఉండగా.. పాజిటివిటీ రేటు…