కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. కొన్ని సార్లు ప్రత్యేక డ్రైవ్ ద్వారా విస్తృతంగా వ్యాక్సిన్ వేస్తున్నారు అధికారులు.. అయితే, బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మరికొన్ని రోజులు వ్యాక్సినేషన్‌కు సెలవులు ప్రకటించారు అధికారులు.. రేపు అనగా 14వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు, 14వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు సీఎం కేసీఆర్.. దీంతో రేపు కోవిడ్ వాక్సినేషన్ కు విరామం వచ్చింది. ఇక, అంతే కాదు.. అక్టోబర్ నెలలోని అన్ని ఆదివారాలు అంటే.. 3, 10, 17, 24, 31 తేదీల్లో వ్యాక్సిన్‌కు సెలవు.. అదనంగా 6, 15, 16 తేదీల్లో కూడా వ్యాక్సిన్ హాలీడే.. తాజాగా, 14వ తేదీ కూడా వ్యాక్సిన్‌కు సెలవు దినంగా ప్రకటించింది తెలంగాణ సర్కార్.