కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే టీకాలు తీసుకొవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా టీకాలు అమలు చేస్తున్నారు. టీకాలు తీసుకున్నాక శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఈ యాంటీబాడీలు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. టీకాలు తీసుకున్నాక చాలా మందికి కరోనా సోకుతున్నది. అలాంటి కేసులను బ్రేక్‌త్రూ కేసులుగా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు అధికంగా నమోదవుతుండటంతో అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. 16 రకాల వేరియంట్లపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని యేల్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా బారిన పడినప్పటికీ త్వరగా కోలుకొని బయటపడుతున్నారని, దీనికి కారణం వ్యాక్సిన్ తీసుకున్నాక శరీరంలో డెవలప్ అవుతున్న యాంటీబాడీలే అని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
Read: ఇండియా కరోనా అప్డేట్: స్వల్పంగా పెరిగిన కేసులు…