Parabhava Nama Samvatsaram: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి?.. అర్థం, విశేషాలు, పూర్తి వివరాలు
- శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి
- ఇది 60 సంవత్సరాల చక్రంలో 40వ సంవత్సరం
- పరాభవం అంటే అహంకారాన్ని జయించి వినయం వైపు నడిపించే కాలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగింటి తొలిపండుగ ఉగాదిని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ప్రధాన ఆలయాలన్ని ఉగాది వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, రాశి ఫలాలను పండితులు చెబుతుంటారు. అయితే ఈసారి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనగానే అంతా ఆలోచనలో పడిపోయారు. పరాభవం అంటే అన్నీ అవమానాలేనా, పరాభవం తప్పదా? అని ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పండితులు శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి? దాని అర్థం, పూర్తి వివరాలను తెలియజెప్పారు. ఆ వివరాలు మీకోసం.
Also Read: PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
Also Read
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
తెలుగు క్యాలెండర్‌లో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటుంది. ఇవి 60 సంవత్సరాల చక్రం (ప్రభవ నుంచి అక్షయ వరకు)లో తిరిగి వస్తాయి. 2026 మార్చి 19న (ఉగాది రోజు, గురువారం) నుంచి మొదలయ్యే కొత్త తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం (2026-2027). ఇది 60 సంవత్సరాల చక్రంలో 40వ సంవత్సరం. పరాభవ అనే పేరు వినగానే చాలామంది “ఓటమి, అవమానం” అని భయపడతున్నారు. కానీ జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇచ్చే లోతైన అర్థం చాలా సానుకూలం, జీవిత పరిణామానికి సంకేతంగా నిలుస్తోంది.
60 సంవత్సరాల చక్రం ఎలా ఏర్పడింది?
జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతి (గురు గ్రహం) ఒక్కొక్క రాశిని దాటడం ఆధారంగా ఈ చక్రం ఏర్పడింది. బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి సుమారు 12 సంవత్సరాలు పడుతుంది. ఇలా 5 సార్లు (12×5=60) పూర్తి చక్రం ఏర్పడుతుంది. పురాణాల ప్రకారం.. నారద మహర్షికి 60 మంది సంతానం ఉండేదని, వారి పేర్లనే సంవత్సరాలకు ఇచ్చారని చెబుతారు. మరికొందరు ఇవి దక్ష ప్రజాపతి కుమార్తెలు లేదా సందీపని సంతానం పేర్లని అంటారు.
ఈ 60 సంవత్సరాలను మూడు భాగాలుగా విభజిస్తారు
1 నుంచి 20 (ప్రభవ నుంచి వ్యయం వరకు) → బ్రహ్మకు చెందినవి
21 నుంచి 40 (సర్వజిత్ నుంచి పరాభవ వరకు) → విష్ణువుకు చెందినవి
41 నుంచి 60 (ప్లవంగ నుంచి అక్షయ వరకు) → శివుడికి చెందినవి
పరాభవ 40వ సంవత్సరం కాబట్టి విష్ణు విభాగంలో చివరి సంవత్సరం. ఇది మన జీవిత చక్రాన్ని (బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు) పోలి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త జన్మలా మార్పు వస్తుంది.
పరాభవ అంటే ఏమిటి?
సంస్కృతంలో పరా + భవ = “పరాభవ” అంటే ఓటమి, అపజయం, అవమానం, పతనం, పరాజయం. కానీ జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు ఇచ్చే లోతైన అర్థం.. అహంకారం, గర్వం, స్వార్థం వంటి అంతర్గత శత్రువులను (అరిషడ్వర్గాలు) జయించడం, గత అనుభవాలు, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం, ఆత్మపరిశీలన ద్వారా వ్యక్తిత్వ వికాసం, వినయం, విధేయతతో ఉన్నత స్థానాలు చేరడం.
“పరాభవం అంటే అహంకారాన్ని జయించి వినయం వైపు నడిపించే కాలం” అని పండితులు చెబుతున్నారు. ఇది జీవితంలో మార్పు, పరిణామం, కొత్త ప్రారంభాలకు సంకేతం.
జ్యోతిష్య ఫలాలు, సమాజంపై ప్రభావం
జ్యోతిష గ్రంథాల ప్రకారం.. పాలకులు, ప్రజల మధ్య అవమానాలు, ఆధిపత్య ధోరణి, ధన నష్టాలు, నైతిక పతనాలు, ఓటములు సాధ్యం, అయితే వినయంగా ఉంటే అద్భుత మార్పులు, ఉన్నతి వస్తాయి.
పరాభవ సంవత్సరంలో ఏం చేయాలి?
అహంకారాన్ని వదిలి వినయంతో జీవించండి
ఆత్మపరిశీలన చేసుకోండి
ధర్మం, భక్తి, దానం పెంచండి
ఉగాది రోజు కొత్త పంచాంగం వింటూ షడ్రుచుల పచ్చడి తిని కొత్త సంవత్సరాన్ని స్వాగతించండి
Also Read: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ ‘రివెంజ్’ షురూ.. సినిమాలో యామీ గౌతమ్ సర్ప్రైజ్ రోల్ ఇదే!
పరాభవ నామ సంవత్సరం పేరులో ప్రతికూలత ఉన్నా, ఇది అహంకారాన్ని జయించి, వినయం ద్వారా ఉన్నతికి దారి చూపే అద్భుత సంవత్సరం. ఇది మనకు ఇచ్చే సందేశం.. “లోపాలను గుర్తించి అధిగమించండి, మార్పును స్వీకరించండి, ధర్మంతో ముందుకు సాగండి.”శ్రీ పరాభవ నామ సంవత్సరం అందరికీ శుభాలు, సుఖాలు, ఆరోగ్యం, సమృద్ధి కలగాలి. ఉగాది 2026 శుభాకాంక్షలు.
తాజావార్తలు
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ట్రెండింగ్
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!