కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో కరోనాను పూర్తిగా దేశం నుంచి తరిమికొట్టి జీరో కరోనా దేశంగా గుర్తింపు పొందింది న్యూజిలాండ్. అయితే, ఇటీవలే అక్లాండ్‌లో డెల్టా కేసు ఒకటి బయటపడటంతో వెంటనే దేశంలో మూడు రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. కాగా, ఇప్పుడు ఇదే విధమైన మరో కఠిన నిర్ణయం తీసుకున్నది న్యూజిలాండ్ ప్రభుత్వం. డిసెంబర్ 1 వరకు ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఉపాద్యాయులు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని న్యూజిలాండ్ విద్యాశాఖ ప్రకటించింది. కరోనా కట్టడి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తీసుకోవాల్సిందేనని విద్యాశాఖ తెలియజేసింది.
Read: పూరైన నామినేషన్ల పరిశీలన… బరిలో ఎంతమంది అంటే…