గాంధీ భవన్ లో ఇంచార్జి థాక్రే తో వి. హనుమంతరావు, దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. అనంతరం పార్టీ కార్యక్రమాలపై చర్చ జరిగిన అనంతరం వి. హనుమాతరావు మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని తెలిపారు. నాయకులు అంతా పాదయాత్రలు చేయాలని పిలుపు నిచ్చారు. రేవంత్ ఫోన్ చేసి పాదయాత్రకి రమ్మన్నారని తెలిపారు.
Telangana Congress: గాంధీ భవన్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఇందుకు మరోసారి వేదిక అయ్యింది.
దేశానికి ఓబీసీ ప్రధాని అయితే అందరం సంతోష పడ్డామని.. కానీ 8 ఏళ్లలో ఒక పని కూడా చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. మండల కమిషన్ సిఫార్సు ముందుకు దాటట్లేదని ఆయన అన్నారు.